ఎండాకాలంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. శుక్రవారంరాత్రి కురిసిన భారీ వర్షాలకు.. లోతట్టు ప్రాంతాలు మోకాల్లోతు నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో మౌనిక అనే ఓ చిన్నారి డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఈ రోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా… పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు.
మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందిన స్థలంలో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. జీహెచ్‌ఎం సీ అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు మండిపడగా, బీజేపీ కార్పొరేటర్‌పై బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ కార్పొరేటర్ సుచిత్రను స్థానికులు నిలదీశారు. మ్యాన్‌హోల్స్ తెరిచి ఉన్నా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు.
గద్వాల్ విజయలక్ష్మీ రియాక్షన్ ఇదే..
చిన్నారిమౌనిక మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. నాలా హోల్‌పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కాషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అందరిముందు మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు జరుగుతున్న సందర్భంలో అధికారులు ఇచ్చే ఆదేశాలను ఎవరు అతిక్రమించవద్దని అన్నారు.
జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మృతి చెందిన మౌనిక కుటుంబాన్ని పరామర్శించారు. పాప కుటుంబాన్ని జీహెచ్ఎంసీ వైపు నుంచి ఆదుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. అయితే.. మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి.. రాత్రివేళల్లో రోడ్లపై నీరు నిలబడకుండా ఉండేందుకు స్థానికులే.. మ్యాన్ హోల్స్‌పై మూతలు తీసేస్తున్నారని…. గతంలోనూ తాము ఈ విషయంపై హెచ్చరించామని.. అయినా.. ఎవరూ పట్టించుకోలేదని.. అందుకే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని స్థానికులపై నెపం నెట్టేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
This post was last modified on April 29, 2023 4:38 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…