అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పసిబిడ్డ అనుకోకుండా తనువు చాలిస్తే ఆ బాధను తట్టుకోవడం ఏ తల్లిదండ్రులకూ సాధ్యం కాదు. కడుపు కోతను మించిన విషాదం ఇంకేం ఉంటుంది? అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ఘోరమైన విషాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో అలాంటి ఘోరమే చోటు చేసుకుంది. 13 నెలల చిన్నారి కారు కింద పడి రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డిలోని ఇస్రోజివాడిలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ చిన్నారి పేరు అయాన్షు. అతను తన పెదనాన్న కారు కిందే పడి తనువు చాలించాడు. అయాన్షు పెదనాన్న.. ఇంట్లోంచి కారును బయటికి తీస్తుండగా.. వెనుక నుంచి వచ్చి కారు కింద పడిపోయాడు. డ్రైవర్‌కు విషయం తెలియకుండా కారును పిల్లాడి మీద పోనిచ్చాడు. దీంతో క్షణాల్లో పిల్లాడి ప్రాణం పోయింది. దీంతో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. సదరు కారు మీద డేంజరస్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ కింద నాలుగు చలానాలు ఉన్నట్లు గుర్తించారు. పసి పిల్లల్ని ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండాలని చెప్పడానికి ఇలాంటి ఘోరాలే ఉదాహరణ.
This post was last modified on April 10, 2023 5:12 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…