పెళ్లి చేసుకోవడానికి ఏం కావాల్నో.. అంటే.. వయసు-మనసు రెండూ కావాలి అత్తగారు.. అంటాడు కన్యాశు ల్కం నాటకంలో గిరీశం. అయితే.. ఇది ఎవరికో చెప్పలేదు కాబట్టి.. మనకేనని.. మన భారతీయులకేనని సరిపెట్టుకోవాలి. కానీ, పాశ్చాత్యులకు ఈ నియమం లేదు. అందుకే కాటికి కాళ్లు చాపుకొన్న వయసులో 92 ఏళ్ల వృద్ధుడిగా ఉన్నప్పటికీ.. రూపర్ట్ మర్దోక్ పెళ్లికి రెడీ అయ్యారు. తన ప్రియురాలు.. (ఆమేమీ తక్కువకా దు.. ఆమెకు కూడా 66 ఏళ్లు.) స్మిత్‌తో ఆయన వివాహానికి ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు. కానీ, ఇంతలో వీరి వివాహానికి బ్రేక్ పడింది. వీరి పెళ్లి విషయం ఎలా అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఇంట్రస్టింగ్ టాపిక్ అయిందో.. ఇప్పుడు వీరి బ్రేకప్ కూడా.. అంతే ఆసక్తిగా మారింది.
విషయం ఏంటంటే..
మీడియా మొఘల్.. రూపర్ట్ మర్దోక్ కు 92 ఏళ్లు. ఈయన ఆస్ట్రేలియా సంతతి వ్యక్తి. అయితే.. అమెరికాలో స్థిరపడ్డారు. ఇక్కడే మీడియా బిజినెస్‌లో ఆరితేరారు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే.. కడపటి జీవితంలోనూ ఆయనలో ఇంకా పులుపు తగ్గలేదు. దీంతో 92 ఏళ్లు వచ్చేసి.. ముఖం అంతా ముడతలు పడిపోయినా.. వలపు రాగాలు తీయడం మానలేదు. ఈ క్రమంలోనే తన ప్రియురాలు స్మిత్‌ను వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారు.
కోట్ల కొద్దీ ఆస్తులు.. లెక్కలేనన్ని సౌకర్యాలు.. ఆమె మాత్రం ఎందుకు కాదంటుంది. సరే.. కానీ! అంటూ.. ఈ వృద్ధులు ఇద్దరూ వివాహానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే మార్చి 17న న్యూయార్క్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పట్లో భారీ వేడుక కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున విందు ఇచ్చారు. నిశ్చితార్థాన్నే పెళ్లి వేడుకను తలపించేలా చేశారు.
ఈ సందర్భంగా స్మిత్ చేతికి ఉంగరం తొడిగిన మర్దోక్ మాట్లాడుతూ.. ‘నేను మళ్లీ ప్రేమలో పడటానికి భయపడ్డాను. కానీ, నాకు తెలుసు ఇదే నా చివరి వివాహమని. చాలా సంతోషంగా ఉంది’ అని ప్రకటించారు. ఇక, అప్పట్లో పెట్టుకున్న ముహూర్తం ప్రకారం.. వేసవిలో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేపింది.
అయితే.. ఈ వృద్ధుల ప్రణాళికలన్నీ ఆగిపోయాయట. వీరు పెట్టుకున్న ముహూర్తం కూడా రద్దయిందని సమాచారం. దీనికి కారణం.. 92 ఏళ్ల వరుడుకి, 66 ఏళ్ల వధువుకు మనసులు కలవలేదట. దీంతో పెళ్లి వద్దులే అని నిర్ణయం తీసుకుని.. నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారట. ‘న్యూస్‌కార్ప్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలియనీర్ అయిన మర్దోక్‌కు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. చివరిసారిగా 2016లో జెర్రీహాల్‌ను మనువాడారు. 2022లో ఈమెకు విడాకులు ఇచ్చారు. సో.. ఇదీ.. సంగతి!!
This post was last modified on April 7, 2023 4:18 pm
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…
తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…