ప్రేమల పేరుతో జరుగుతున్న దారుణాలు ఎక్కడా ఆగడం లేదు. దేశంలో ఢిల్లీలో చోటు చేసుకున్న 36 ముక్కల ఉదంతం మరిచిపోక ముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని కెనడా నుంచి పిలిచి మరీ హత్య చేశాడో వ్యక్తి. అనంతరం ప్రియురాలి మృతదేహాన్ని తన ఫామ్హౌస్లో పాతిపెట్టాడు. దాదాపు ఏడాది తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు మోనిక(23) రోహ్తక్ ప్రాంతంలోని బాలంద్ గ్రామానికి చెందిన యువతి. ఐఇఎల్‌టీఎస్ కోర్సు చేయడానికి సోనిపత్ ప్రాంతంలోని గుమాడ్ గ్రామంలోని తన అత్త ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉండే సునీల్ అనే వ్యక్తితో మోనికకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే.. ఇదివరకే సునీల్కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం మోనికకు కూడా తెలుసు.
ఇంతలో పై చదువుల కోసం మోనిక.. కెనడా వెళ్లింది. కొన్ని రోజులు గడిచాక.. సునీల్ మోనికకు ఫోన్ చేసి ఇండియా రావాల్సిందిగా కోరాడు. దీంతో మోనిక ఇండియా వచ్చింది. అనంతరం ఇద్దరూ 2022 మేలో గాజియాబాద్లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. అనంతరం ఓ రోజు మోనికను తన ఫామ్హౌస్కు తీసుకెళ్లాడు సునీల్. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సునీల్.. మోనికను కాల్చి చంపాడు.
అనంతరం మోనిక మృతదేహాన్ని.. ఇదివరకే వాటర్ ట్యాంక్ కోసం అని తవ్వించిన ఓ 10 అడుగుల గోతిలో పాతిపెట్టాడు. అయితే, మోనిక.. 2022 జనవరి నుంచి మే వరకు రెండు సార్లు ఇండియా వచ్చిందని పోలీ సుల విచారణలో వెల్లడైంది. మోనిక కెనడా నుంచి తిరిగి వచ్చిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియదని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న నిందితుడు సునీల్ను అరెస్టు చేశారు.
కారణమేంటి?
సునీల్కు తన భార్యతో ఉండటం ఇష్టం లేదు. ఎప్పుడూ విదేశాల్లో సెటిల్ కావాలని కలలు కనేవాడు. ఈ క్రమంలో మోనిక కెనడాలో పీఆర్(పర్మనెంట్ రెసిడెన్సీ) పొందితే శాశ్వతంగా అక్కడే ఉండచ్చని ఆశపడ్డా డు. అయితే, తనకు భారత్ అంటే నే ఇష్టమని.. ఇక్కడే కాపురం పెడదామని మోనిక ఘర్షణకు దిగింది. దీంతో అతడి ప్లాన్ వర్కవుట్ కాదని గ్రహించి మోనికను మర్డర్ చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడి ఫామ్హౌస్ నుంచి మృతదేహం అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాచారు.
This post was last modified on April 6, 2023 11:47 am
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…