Trends

క్రికెట్ దిగ్గజం.. నాయ‌క్ క‌న్నుమూత‌

భారత క్రికెట్ జ‌ట్టులో ప‌డిలేచిన కిర‌ణం.. టీమ్ఇండియా మాజీ ఓపెనర్‌ సుధీర్‌ నాయక్‌. ఏమీ లేని స్థాయి నుంచి క్రికెట్ బ్యాట్ కూడా కొన‌లేని ప‌రిస్థితి నుంచి టీమ్ ఇండి ఓపెన‌ర్‌గా ఎదిగిన నాయ‌క్‌.. భార‌త క్రికెట్ కీర్తి కిరీటంలో ఒక క‌లికితురాయి. అయితే.. ఆయ‌న‌కు రావాల్సిన గుర్తింపు.. ద‌క్కాల్సిన మ‌ర్యాదులు ద‌క్క‌లేదు. దీనికి కూడా కొన్ని కార‌ణాలు ఉన్నాయి. అయితే.. 78 ఏళ్ల వ‌య‌సులో నాయ‌క్‌ తుదిశ్వాస విడిచారు.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. త‌న  కుమార్తె  దగ్గరే ఉంటున్న నాయక్ ఇటీవల బాత్రూంలో జారిపడ్డారు. తలకు గాయం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిన నాయక్‌ మళ్లీ కోలుకోలేదు. అప్ప‌టి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆయ‌న తాజాగా క‌న్ను మూశారు.  

కెరీర్‌లో.. మ‌లుపులు!

నాయక్.. 1970-71 రంజీ ట్రోఫీ సీజన్లో బ్లూరీ బ్యాండ్ గ్లోరీ టీమ్కు నాయకత్వం వహించాడు. అప్పుడు జట్టును గెలిపించి.. ట్రోఫీని ముద్దాడాడు.. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సార్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేకుండానే ఆయన తన టీమ్ను గెలిపించారు.

1974లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశారు. రెండో ఇన్నింగ్స్లో 77 పరుగులు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. 1974లో భారత్‌ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 85 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు.  దాదాపు 4376 పరుగులు చేశారు.

బ్యాటింగ్లో దూకుడుగా ఉండే నాయ‌క్‌.. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఏడు సెంచరీలు బాదారు. ఓ ద్విశతకం కూడా కొట్టారు. అలా తన ఆటతో క్రికెట్ అభిమానులతో పాటు సహ ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. వారి ప్రశంసలను పొందారు.

రెండో ఇన్నింగ్స్లో మంచి కోచ్‌గానూ గుర్తింపు సాధించారు. క్రికెటర్ జహీర్‌ ఖాన్‌ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇంకా ఆయన తన కెరీర్లో ముంబయి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా, వాంఖడే స్టేడియం క్యురేటర్‌గా కూడా పని చేశారు.

దొంగ‌త‌నం ఆరోప‌ణ‌లు

కెరీర్లో ఎంత పేరు సంపాదించారో అలానే సుధీర్ నాయ‌క్‌ కష్టాలను కూడా చూశారు.  1970లలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయపై దొంగతనం ఆరోపణలు కూడా వచ్చాయి. లండన్ డిపార్ట్మెంటల్ స్టోర్లో రెండు జతల సాక్స్ను దొంగిలించారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. అయితే, ఆ సమయంలో సునీల్ గావస్కర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ కేసును ఎదుర్కొన‌క త‌ప్ప‌లేదు.

This post was last modified on April 6, 2023 11:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago