ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఉన్న వారిలో 169 మంది భారత్‌లో ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. తాజాగా ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా-2023ను విడుదల చేసింది. దీనిలో భారత్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. మొత్తం 169 మంది 675 బిలియన్ డాలర్ల ఆస్తిని కలిగి ఉన్నారని జాబితా వెల్లడించింది. అయితే, 2022తో పోల్చుకుంటే 75 బిలియన్ డాలర్లు తగ్గినట్టు పేర్కొంది.
ఈ జాబితా ప్రకారం.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారత దేశంలో అత్యంత సంపన్నుడుగా తేలింది. ఈయన ఆస్తి విలువ 63.4 బిలియన్ డాలర్లని పేర్కొంది. ఇక, ప్రపంచ సంపన్నుల జాబితాలో ఈయన 9వ స్థానంలో ఉండడం గమనార్హం.
ఇక, అమెరికా విషయానికి వస్తే.. అత్యధిక సంఖ్యలో బిలియనీర్లను కలిగిన దేశంగా ముందుంది. 735 మంది అమెరికాలో బిలియనీర్లుగా ఉండడం గమనార్హం. వీరి ఆస్తి 4.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. తర్వాత.. స్తానంలో చైనా ఉంది. ఇక్కడ 562 మంది బిలియనీర్లు ఉండగా.. వీరి ఆస్తి 2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్టు జాబితా స్పష్టం చేసింది. ఇక, మూడో స్థానంలో భారత్ ఉంది. నిజానికి గత ఏడాది ఈ సంపన్నుల ఆస్తి ఇంతలేదని.. జాబితా పేర్కొనడం గమనార్హం.
ఇదిలావుంటే.. గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈ సంవత్సరం బిలియనీర్ల జాబితా తగ్గిందని.. ఫోర్బ్స్ తెలిపింది. దీనికి కారణాలుగా స్టాక్స్ దెబ్బతినడం, యూనికార్న్ దెబ్బ.వడ్డీ రేట్లు పెరగడం వంటివి ఉన్నాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. గత ఏడాది 2668 మంది ఉంటే.. ఇప్పుడు 2640 కి తగ్గింది. అత్యంత సంపన్నుల ఆస్తి కూడా 2022లో తగ్గినట్టు జాబితా పేర్కొంది. 2022లో 12.7 ట్రిలియన్ల డాలర్లు ఉండగా.. ప్రస్తుతం ఇది 12.2 ట్రిలియన్లుగా ఉందని పేర్కొంది. అంటే.. 500 బిలియన్ డాలర్లు తగ్గుముఖం పట్టింది.
ఎలాన్ మస్క్ నెంబర్ 1 స్థానం నుంచి నెంబర్ 2కి పడిపోయారు. టెస్లా షేర్లు తగ్గుముఖం పట్టడంతో ఆయన స్థానం పడిపోయిందని ఫోర్బ్స్ పేర్కొంది. లగ్జరీ గూడ్స్ దిగ్గజం LVMH అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా అతని స్థానాన్ని ఆక్రమించాడు. ఫ్రాన్స్ పౌరుడు మొదటిసారిగా ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
మార్కెట్లలో తగ్గుదల సంవత్సరం ఉన్నప్పటికీ, తూర్పు ఐరోపాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, యుద్ధం, 1,000 కంటే ఎక్కువ మంది బిలియనీర్లు వాస్తవానికి ఫోర్బ్స్ యొక్క 2022 జాబితాలో ఉన్న వారి కంటే ధనవంతులు కావడం గమనార్హం. కొందరు పదివేల బిలియన్ల డాలర్లతో ఉన్నారు.
లగ్జరీ గూడ్స్ వ్యాపారవేత్త ఆర్నాల్ట్ అత్యుత్తమ స్థానంలో ఉన్నారు. అతని నికర విలువ గత సంవత్సరం నుండి $53 బిలియన్లు పెరిగింది. ఇది అందరికంటే పెద్ద లాభం. లూయిస్ విట్టన్, క్రిస్టియన్ డియోర్ మరియు టిఫనీ & కో వంటి బ్రాండ్‌లను కలిగి ఉన్న అతని LVMH షేర్లు బలమైన డిమాండ్ కారణంగా 18 శాతం పెరిగాయి. ఇప్పుడు 211 బిలియన్ డాలర్ల విలువైన ఆర్నాల్ట్ ప్రపంచ బిలియనీర్స్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అతను నెంబర్ 1 స్థానంలో నిలవడం ఇది మొదటిసారి. ఫ్రాన్స్ పౌరుడు ఈ జాబితాలో నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ $ 84.5 బిలియన్ల నికర విలువతో జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు.
This post was last modified on April 5, 2023 12:06 pm
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……