అమెరికా చరిత్రలోనే ఒక మాజీ అధ్యక్షుడు జైలుకు వెళ్లడం ఇదే మొదటిసారి. శృంగార తారకు డబ్బులిచ్చి నోరు మూయించిన కేసులో డోనాల్డ్ జే ట్రంప్ పై మాన్ హట్టన్ కోర్టు విచారణ మొదలు పెట్టింది. అమెరికా చరిత్రలోనే అధ్యక్షులుగా పని చేసిన వారెవరు అరెస్టులు కాలేదు జైలుకీ వెళ్ళలేదు. ఈ రెండు ట్రంప్ విషయంలో జరిగిపోయింది. ట్రంప్ పై మోపిన అభియోగాలు దాదాపు నిజాలే అని నిరూపితమవ్వటం పెద్ద కష్టం కాదని సమాచారం.
ఇంతకీ విషయం ఏమిటంటే 2016 ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన విషయం తెలిసిందే. అద్యక్ష ఎన్నికలకు ముందు ఎప్పుడో స్మార్టీ డేనియల్స్ అనే శృంగాత తారతో ట్రంప్ గడిపారట. ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటం కోసం సదరు తారకు ట్రంప్ తన లాయర్ ద్వారా పెద్దఎత్తున డబ్బు ముట్టచెప్పారట. తర్వాత ఎన్నికల్లో ట్రంప్ గెలవటం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోవటం అందరికీ తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పోటీచేయాలని ట్రంప్ రెడీ అవుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే శృంగార తార తెరమీదకు వచ్చింది. ట్రంప్ తనతో గడిపిన విషయాన్ని బయటపెట్టింది. అయితే శృంగార తార ఎవరో తనకు తెలీదని ట్రంప్ వాదించారు. ట్రంప్ వాదన తప్పంటు స్మార్టీ తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టింది. దాంతో విషయం కాస్త పెద్ద వివాదంగా మారింది. చివరకు ఆ వివాదంపై కోర్టులో కేసు నమోదైంది. ఇపుడా కేసులోనే ట్రంప్ అరెస్టయి జైలుకు వెళ్ళారు.
జైలుకు వెళ్ళారంటే కేసు విచారణ జరిగి తీర్పు చెప్పటం ద్వారా ట్రంప్ జైలుకు వెళ్ళలేదు. విచారణలో భాగంగా ట్రంప్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఇక్కడ అర్ధంకాని విషయం ఏమిటంటే ఇద్దరు ఇష్టపడి శృంగారంలో పాల్గొన్న తర్వాత సమస్య ఎక్కడ వచ్చిందో అర్ధంకావటంలేదు. ట్రంప్ తరపున స్మార్టీకి తాను డబ్బులిచ్చింది నిజమే అని లాయర్ అంగీకరించారు. దాంతో ట్రంప్ పై ఉచ్చు బలంగా బిగుసుకుంది. మరి చివరకు కోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…