Trends

ల‌క్ అంటే వీడిదే.. 49 పెట్టుబ‌డితో.. కోటిన్న‌ర కొట్టాడు!

ల‌క్.. అదృష్టం.. ఎప్పుడు ఎవ‌రిని ఎలా వ‌రిస్తుందో చెప్ప‌డం క‌ష్టం. రాత్రికి రాత్రి భిక్ష‌గాణ్ని.. ధ‌న‌వంతుడిని చేస్తుంది.. అంటారే.. అచ్చం ఇప్పుడు అలానే జ‌రిగింది. రాత్రికి రాత్రి.. ఒక యువ‌కుడిని కోటీశ్వ‌రుణ్ని చేసింది. కేవ‌లం 49 రూపాయ‌ల పెట్టుబ‌డితో.. ఏకంగా కోటిన్న‌ర రూపాయ‌ల సంప‌ద‌కు అధిప‌తిని చేసింది. దీంతో ఈ సంగ‌తి తెలిసిన వాళ్లు.. ఇది క‌దా ల‌క్కంటే! అని మెటిక‌లు విరుస్తున్నారు.. బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు. మ‌రి ఈ సంగ‌తేంటో చూద్దామా..!

మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని బార్వానీ జిల్లాకు చెందిన ష‌హ‌బుద్దీన్ మ‌న్సూరి.. పేద కుటుంబానికి చెందిన యువ‌కుడు. త‌న పేద‌రికాన్ని త‌లుచుకుని త‌ర‌చుగా బాధ‌ప‌డేవాడు. ఈ క్ర‌మంలో ల‌క్కును ప‌రిశీలించుకోవాల‌ని.. ప్ర‌య‌త్నం చేయ‌గా.. చేయ‌గా.. ఎప్ప‌టికైనా అదృష్టం వ‌రించ‌క‌పోతుందా? అని భావించాడు. ఈ నేప‌థ్యంలోనే ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో క్రికెట్ గేమ్ ఆడడం ప్రారంభించాడు. ఇలా.. ఒక‌టి కాదు.. గ‌త రెండేళ్లుగా బెట్టింగులు క‌డుతూనే ఉన్నాడు. అయితే..ఎప్పుడూ.. కూడా రూ.49 కి మించి క‌ట్టింది లేదు.

ఇక‌, ఈ యాప్‌లో స్వ‌యంగా ష‌హ‌బుద్దీన్ ఒక టీం ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకుంటున్న ష‌హ‌బుద్దీన్‌కు తాజాగా ల‌క్ చిక్కింది. కోల్‌క‌తా, పంజాబ్ టీంల మ‌ధ్య ఆదివారం.. నిర్వ‌హించిన ఆన్‌లైన్ గేమింగ్‌లో రూ.49 కేట‌గిరిలో ఫ‌స్ట్ ప్లేస్ సాధించాడు. దీంతో ఏకంగా రూ.1.5 కోట్ల రూపాయ‌ల జాక్ పాట్ కొట్టాడు. ఇంకేముంది.. ష‌హ‌బుద్దీన్ స్నేహితులు, కుటుంబ స‌భ్యులు సంతోషంలో మునిగిపోయారు. ల‌క్ అంటే.. ఇది క‌దా! అని సంబ‌రాలు చేసుకుంటున్నారు.

This post was last modified on April 4, 2023 9:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌గ‌న్ ఎఫెక్ట్‌: 2 వేల లీట‌ర్ల డీజిల్‌.. 2 కోట్ల ఖ‌ర్చు.. నీళ్లు తోడుతున్నారు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజ‌ధానుల పేరుతో ఆయ‌న న‌వ్యాంధ్ర…

1 hour ago

ముర‌ళీమోహ‌న్ అంత‌రంగం.. అయితే, అదే పెద్ద స‌మ‌స్య‌!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌, వ్యాపార వేత్త ముర‌ళీమోహ‌న్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…

3 hours ago

ఆ రోజుల్లో… శ్రీవారు క‌నిపించేది సెక‌నంటే సెక‌నే!!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఓ 2 నిమిషాలు ల‌భిస్తుంద‌ని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్న‌గారు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా…

4 hours ago

బ్రేకింగ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…

5 hours ago

అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…

7 hours ago