రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురించి పరిచయం అక్కరలేదు. ఆసియాలోని కుబేరులలో ఒకరిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అయితే తన భర్త బిలియనీర్ అయినప్పటికీ ఆయన సతీమణి నీతా అంబానీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రిలయన్స్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న నీతా అంబానీ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు వ్యవహారాలలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.
కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై మక్కువ ఎక్కువ ఉన్న క్రమంలోనే తాజాగా నీతా అంబానీ తన కలల ప్రాజెక్టు నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ (NMAC) ను ప్రారంభించారు. NMAC ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా అంబానీ ఇంటికి కాబోయే కోడలు రాధికా మర్చంట్ తన హ్యాండ్ బ్యాంగ్ తో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఈ వేడుకలో నల్ల చీరలో తళుక్కుమన్న రాధికా మర్చంట్ తన వెంట తెచ్చుకున్న మినీ బ్యాగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ బ్యాగ్ లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్ సిగ్నేచర్ కెల్లీ డిజైన్ తో పాటు చైన్ మెయిల్ బాడీ షోల్డర్ చైన్ వంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. దాదాపు అరకోటి ఖరీదు చేసే ఈ బ్యాగ్ పలువురు దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ స్టాలో ఈ చిట్టి బ్యాగ్ ధర అక్షరాలా 52 ల లక్షల 30 వేల రూపాయలు కావడం విశేషం. ఈ బ్యాగ్ చేతబట్టుకొని అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట ఫోటోలకు ఫోజులిచ్చారు.
దీంతో, అంబానీ కాబోయే కోడలా…మజాకా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, అనంత్ అంబానీ, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 19న ముంబైలో వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
This post was last modified on April 3, 2023 7:09 am
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……