ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా…బుల్లెట్టు దిగిందా లేదా….బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’లో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్. కానీ, పోకిరి సినిమాలో ఈ డైలాగ్ నుంచి స్ఫూర్తి పొందిన కొందరు పోకిరి యువత…ఏం చేశామని కాదన్నయ్యా…పాపులర్ అయ్యామా లేదా అన్నట్లు తయారయ్యారు. ఓవర్ నైట్ గుర్తింపు పొందడం కోసం…సోషల్ మీడియాలో తమ పేరు..ఊరు వైరల్ కావం కోసం వింత పోకడలకు పోతున్నారు.
తాజాగా జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఓ యువతి ఢిల్లీ మెట్రోలో రచ్చ చేసింది. మినీ బికినీ, బ్రాతో ధరించి కలకలం రేపింది. బీచ్ లో ధరించే టూ పీస్ బికినీ వేసుకొని పట్టపగలు మెట్రోలో వందలాది మంది ప్రయాణికుల మధ్య ప్రయాణించింది. ఇక, కాసేపటికి బికినీలో అసౌకర్యంగా కనిపించిన ఈ అమ్మడు స్కిన్ షో నుంచి తప్పించుకునేందుకు తన బ్యాగ్ ను అడ్డుపెట్టుకుంది. దీంతో, ఇదేం ఖర్మ అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
అంత పొట్టి డ్రెస్ వేసుకోవడమెందుకు..అలా ఇబ్బంది పడటమెందుకు అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది మహిళా సాధికారతకు ఉదాహరణా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ సెక్యూరిటీని దాటి లోపలికి ఎలా వచ్చింది? చూడటానికి దరిద్రంగా ఉంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఎట్రాక్షన్ కోరుకుంటోన్న ఇలాంటి యువతులు ఇలా చేస్తున్నారని మరో యూజర్ స్పందించారు. ఇది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అని… బీచ్ కాదని…. ఫ్రీడమ్ పేరుతో ప్రతి ఒక్కరూ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా? అని ఇంకో యూజర్ మండిపడ్డారు.
ఇక, కొద్ది రోజుల క్రితం ఒక పురుషుడు బనియన్ పై, అండర్ వేర్ పై మెట్రోలో ప్రయాణిస్తే కేసు పెట్టారని, కానీ, ఈమెపై ఎటువంటి చర్య తీసుకోలేదని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇదేనా లింగ సమానత్వం అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై ఎలాంటి వివక్షా లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on April 2, 2023 8:37 pm
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…