Trends

లవ్ హాలిడేస్: ప్రేమించుకోవడానికి సెలవలు

చైనాలో ప్రభుత్వం తీసుకొనే చాలా నిర్ణయాలు వినూత్నంగా ఉంటుంటాయి. లాక్ డౌన్ సమయంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా పలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం, అవి కాస్తా వివాదాస్పదంగా మారడం తెలిసిందే. చావనైనా చస్తాం ..మాకు ఈ లాక్ డౌన్ ఎత్తేయండి మహా ప్రభో అంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇటీవల నిరసన తెలిపిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా చైనా ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం వార్తల్లో నిలిచింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాకు పేరుంది. అయితే, ప్రస్తుతం చైనాలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. దీంతో, చైనా సర్కార్ అక్కడ జనాభా పెంచేందుకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జననాల రేటు పెంచేందుకు కాలేజీలలో లవ్ హాలిడేస్ ప్రకటించడం వివాదానికి దారి తీసింది. ప్రేమించుకోండి అంటూ ఏప్రిల్ లో ఏకంగా వారం రోజుల పాటు సెలవుల వరాన్నిచ్చింది చైనా ప్రభుత్వం. ఈ నిర్ణయంతో కుర్రకారు హుషారుగా ఉన్నప్పటికీ…చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.

జీవితాన్ని ప్రేమించండి…జీవితాన్ని ఆస్వాదించండి అంటూ నినదిస్తున్న చైనా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జననాల రేటును పెంచేందుకు ఇంతకంటే గొప్ప మార్గం దొరకలేదా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి చైనాలో 1980-2015 మధ్యకాలంలో ఒక జంటకు ఒక బిడ్డ అనే నిర్బంధాన్ని ప్రభుత్వం విధించింది. దీంతో, ప్రస్తుతం జనాభా తగ్గుముఖం పట్టింది. ఇక, కోవిడ్ తర్వాత అయితే, జంటలు ఒకరినే కనడానికి ఇష్టపడుతున్నాయి.

ముగ్గురు పిల్లలుంటే ప్రోత్సాహకాలిస్తామన్నా సరే…సరైన ఆదాయ వనరులు లేక పిల్లల పోషణ భారం అవుతుందని చాలామంది ఎక్కువమంది పిల్లలను కనేందుకు ఇష్టపడడం లేదు. అందుకని, దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం జననాల రేటు పెంచేందుకు రకరకాల కార్యక్రమాలు చేపట్టింది. ఏది ఏమైనా చైనాలో ‘లవ్ హాలిడేస్’..కాన్సెప్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

This post was last modified on April 2, 2023 4:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చాంపియన్స్‌ ట్రోఫీకి బుమ్రా దూరం… ఫైనల్ టీమ్ ఇదే!

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్‌ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది.…

25 minutes ago

ఏపీలో జూన్ లోగా విధుల్లోకి కొత్త టీచర్లు!

ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ…

39 minutes ago

ఐకాన్ స్టార్ ముద్దు – కండల వీరుడు వద్దు

జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…

2 hours ago

అన్నీ ఓకే.. మరి సమన్వయం మాటేమిటి?

అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార…

2 hours ago

లైలాకు ‘A’ సర్టిఫికెట్….ఇది పెద్ద పరీక్షే

సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…

3 hours ago

అక్కినేని విజయాలకు ముహూర్తం కుదిరింది

నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…

3 hours ago