సోషల్ మీడియాలోనూ..వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ రోజు అకస్మాత్తుగా ఒక వార్త అందరిని ఆకర్షిస్తోంది. దీన్ని చదివినంతనే తమకు తెలిసిన వారిలో అంతో ఇంతో మందికి షేర్ చేస్తున్నారు. ఇంతకీ అంత ఇంట్రస్టింగ్ టాపిక్ ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంత అన్నదే. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రావటంతో.. ఇప్పుడు అందరి ఫోకస్ దాని మీదే పడుతోంది. కారు డ్రైవర్ అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ప్రపంచ ధనికుల్లో ఒకరిని నిత్యం కారులో తిప్పే గురుతర బాధ్యతను నిర్వర్తించే సదరు వ్యక్తికి నెలసరి జీతం ఎంత ఉంటుందన్న ఉత్కంట ఇప్పుడు అందరిలోనూ మొదలైంది.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెలసరి జీతం రూ.2 లక్షలుగా చెబుతున్నారు. అది కూడా ఇప్పటి జీతం లెక్క కాదు సుమా. 2017లోనిది. అంటే.. ఆరేళ్ల క్రితం నాటిదన్న మాట. ఆ లెక్కన ఇప్పుడు ఏ మూడు లక్షలు ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ జీతంతో పోలిస్తే.. ఎంత మంది ఇంత భారీ జీతాన్ని అది కూడా కారు డ్రైవర్ పని చేస్తూ సంపాదిస్తారంటే.. సమాధానం చెప్పలేని పరిస్థితి.
ప్రపంచ కుబేరులలో ఒకరికి కారు డ్రైవర్ గా పని చేయటం అంటే.. కారు మీద ఎంత పట్టు.. నైపుణ్యం ఉండి ఉండాలంటారు? అది కూడా పాయింటే కదా? అందులోని ముకేశ్ అంబానీ లాంటోళ్లు అట్లాంటి ఇట్లాంటి కార్లు వాడరు కదా? ఇప్పుడు వస్తున్న కథనం ప్రకారం.. సదరు డ్రైవర్ ను ఒక ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ద్వారా జాబ్ లో పెట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అంబానీ ఎలాంటి కార్లను వాడతారు? బుల్లెట్ ప్రూఫ్ కారును ఎలా వాడాలన్న దానిపై ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి.. అందులో అత్యంత నైపుణ్యం ఉన్న వ్యక్తికే ఆ బాధ్యతను అప్పగిస్తారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ లెక్కన.. అంబానీ డ్రైవర్ జీతమే ఇంత ఉంటే.. ఇంట్లో పని చేసే వారికి.. వంట మనుషులకు.. మిగిలిన సిబ్బందికి ఎంత చొప్పున ఇస్తారో? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇదంతా చూసిన తర్వాత.. తొక్కలో ఉద్యోగం.. అంబానీ కారు డ్రైవర్ కు వచ్చే జీతం కూడా రావట్లేదన్న మాట అప్పుడప్పుడు నోటి వెంట రావటం ఖాయం కదూ?
This post was last modified on March 4, 2023 9:41 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…