ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడాది పాటు వేర్వేరు నగరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటై ఉత్సవాలను పర్యవేక్షిస్తోంది. వేర్వేరు వర్గాలకు చెందిన ప్రముఖులు ఎన్టీఆర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న తరుణంలోనే ఆయన పేరుతో ఓ నాణెం విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆరు నెలలుగా జరుగుతున్న కసరత్తు ఈ దిశగా ఒక కొలిక్కి వచ్చింది. పూర్తిగా వెండితో తయారు చేసిన వంద రూపాయల నాణెన్ని కేంద్రం ముద్రిస్తోంది.
ఎన్టీఆర్ తనయ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ఇటీవల మింట్ అంటే టంకశాల అధికారులు కలిశారు. జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ హైదరాబాద్ నివాసంలో ఆమెతో భేటీ అయి కాయిన్ నమూనాపై చర్చించారు. సలహాలు సూచనలు తీసుకున్నారు. వంద కాయిన్ పై వేయాల్సిన ఎన్టీఆర్ ఫోటోను పైనలైజ్ చేశారు. అధికారులు ఒకటి రెండు ఫోటోలు చూపించగా అందులో ఒక దానిని పురంధేశ్వరి ఫైనలైజ్ చేశారు. ఆ ఫోటో చాలా హుందాగా ఉంటుందని ఎన్టీఆర్ కుటుంబం అభిప్రాయపడింది. తర్వలోనే ఎన్టీఆర్ ఫోటో ఉన్న వెండి కాయిన్ ను కేంద్రం విడుదల చేస్తుంది..
This post was last modified on February 15, 2023 9:46 am
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…