భాషాభిమానం ఉండొచ్చు. కానీ, అది కొంతవరకు మాత్రమే పరిమితం కావాలి. కానీ, కర్ణాటకలో ఇప్పుడు ఈ అభిమానం మాటున జరుగుతున్న దాడులు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాదీ సింగర్ మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవడంపై కన్నడ భాషాభిమానులు మండిపడ్డారు. ఆమె కారుపై దాడి జరిగినట్లు ఫొటోలతో సహా వార్తలు కూడా వచ్చాయి.
ఇక, ఇప్పుడు తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్‌పైనా ఇదే భాషాభిమానంతో కొందరు దుండగులు వాటర్ బాటిళ్లు విసరడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరలోని హంపిలో జరుగుతున్న ‘హంపి ఉత్సవ్’ ముగింపు కార్యక్రమంలో సింగర్ కైలాష్ ఖేర్ పాల్గొన్నారు. ఈ
కార్యక్రమానికి హాజరయిన వారిలో జోష్ నింపేందుకు కొన్ని పాటలను పాడారు. అయితే.. కన్నడ పాటలు పాడలేదనే కారణంగా ఒకతను కైలాష్ ఖేర్‌పై కొందరు వాటర్ బాటిళ్లు విసిరారు. కన్నడ పాటలు పాడించుకోవాలనుకుంటే కన్నడ గాయకులనే ఆహ్వానించాలని, కైలాష్ ఖేర్ కన్నడ సినిమాల్లో చాలా పాటలు పాడిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని ట్విట్టర్‌లో కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
మరికొందరేమో.. భాషను అభిమానించడంలో ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ.. ఆ భాష మాట్లాడని వారిపై భౌతిక దాడులకు దిగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదగ్గ పరిణామం కాదని ట్వీట్స్ చేశారు. మొత్తానికి భాషాభిమానం పేరుతో ఇలా దాడులకు దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 30, 2023 4:43 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…