సంక్రాంతి సంబరాలకు రాష్ట్రం మొత్తం రెడీ అవుతుంటే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం మాత్రం.. భారీ ఎత్తున కోడి పందేలకు రెడీ అవుతోంది. వైసీపీకి చెందిన కీలక నేతల కనుసన్నల్లో ఇక్కడ బరులు రెడీ అయ్యాయి. ఒక్కొక్క బరికి రెండు ఎకరాలు కేటాయించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఏసీలు, పార్కింగ్.. ఇందులోనూ వైఐపీ, ఏ గ్రేడ్ వీఐపీ, బీ గ్రేడ్ వీఐపీ అంటూ.. వివిధ రకాల పాసులు కూడా రెడీ చేశారు.
ఒక్కొక్క బరిలో పోటీ పడే కోళ్లు.. వాటి సత్తా.. ఆట తీరు.. ఇలా అనేక ప్రమాణాలను అనుసరించి.. ఫ్లడ్ లైట్ల కాంతుల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకు ఈ పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక, గ్రేడ్ ఏ పాస్ 60000, గ్రేడ్ బి పాస్ 40000, వీఐపీ పాస్ 25000 చొప్పులన విక్రయిస్తున్నారు. పాసులు తీసుకున్న వారు మూడు రోజుల్లో ఎప్పుడైనా రావొచ్చు పోవచ్చు. వీరి వెంట ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు.
వీరికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మద్యం కోరుకునేవారికి వేరేగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. వీఐపీలు అందరికీ.. ఏసీ హాళ్లలో క్వాలిటి చికెన్ బిర్యాని, బ్రేక్ ఫాస్ట్‌లో 15 రకాల టిఫెన్లు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో చికెన్, మటన్, చైనా, జపాన్ ఆహార పదార్థాలను కూడా రెడీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి చెఫ్‌లను రప్పించినట్టు తెలుస్తోంది.
అయితే..డబ్బులు కట్టినా కూడా ఎవరికి పడితే వారికి ఎంట్రీ లేకపోవడం గమనార్హం. స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల అనుచరుల కనుసన్నల్లోవారు చెప్పిన వారికే ఈ టికెట్లు విక్రయిస్తున్నారు. ఇదీ.. సంగతి!!
This post was last modified on January 13, 2023 9:09 am
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…