దేశంలో ఘోరాలు.. ఘోరంగా జరుగుతున్నాయి. మనుషులను చంపేయడం.. ఏ చీమనో.. దోమనో చంపేసినంత తేలికగా మారిపోయింది. అంతేకాదు.. ఆ చంపిన వారు.. అక్కడితో కూడా ఆగడం లేదు. సదరు మృత దేహాలను ముక్కలు ముక్కలుగా నరికి.. ఇష్టానుసారం విసిరేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటనలో ఆమె ప్రియుడు ఆమెను 35 ముక్కలు చేసి.. అడవిలో విసరేసిన ఘటన ఉలిక్కి పడేలా చేసింది.
అయితే.. తాజాగా బిహార్‌లో చోటు చేసుకున్న ఘటన దీనికి బాబు అనిపించే రేంజ్‌లో సాగింది. తన చెల్లెలిని ప్రేమించిన ఓయుకుడిని.. సదరు అన్న చంపేశాడు. అక్కడితో ఆగలేదు. ఆ ప్రియుడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారంగా వేశాడు. ఆ కుక్కలు తినగా మిగిలిన శరీర భాగాలను నదిలో విసిరేసి.. వికృతానందం పొందాడు.
అత్యంత పాశవికం.. అమానుషమైన ఈ ఘటన దేశాన్ని కదిలించివేసింది. బిహార్లోని నలంద బిట్టు కుమార్.. ఈ నెల 16వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు వెతకగా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో డిసెంబరు 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణలో భాగంగా నిందితుడు రాహుల్పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరపగా.. రాహుల్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తన సోదరితో బిట్టు సన్నిహితంగా ఉండడం చూశానని అది తట్టుకోలేకపోయానని రాహుల్ పోలీసులకు తెలిపాడు. కోపంతో బిట్టును చంపేందుకు ప్లాన్ చేశానని చెప్పాడు.
డిసెంబరు 16న తన సోదరి మొబైల్ నుంచి ఫోన్ చేసి బిట్టును నిర్మానుష్య ప్రదేశానికి పిలిచానని, అనంతరం అతడిని చంపానని తెలిపాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా పెట్టానని.. అవి వదిలేసిన మిగతా శరీర భాగాలను నదిలోకి విసిరేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘటన మనసున్న ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఇంతకీ ఎందుకు ఇంత ఘోరం చేశాడంటే.. తన చెల్లిని ప్రేమించిన బిట్టు దళితుడు కావడమే!!
This post was last modified on December 28, 2022 5:37 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…