Trends

కామం హద్దులు దాటింది… ప్రాణం పోయింది

సెక్సుకు కూడా ఒక హ‌ద్దు ఉండాలనేది భార‌తీయ సంప్ర‌దాయం. స‌రే.. ఇప్పుడుపాశ్చాత్య పోక‌డ‌లు వ‌చ్చిన త‌ర్వాత‌..ఒక‌రు కాదు ఇద్ద‌రు అంటున్నారు. పోనీ.. దానికైనా క‌ట్టుబ‌డి ఉండాలి క‌దా! అలా ఉండ‌క‌పోవ‌డ‌మే.. అత‌డి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ఏకంగా ఇద్ద‌రిని పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో కాపురం పెట్టిన వ్య‌క్తి.. మ‌రో మ‌హిళ‌పై క‌న్నేశాడు. చివ‌ర‌కు తొలి భార్య చేతిలో అత‌ను హ‌త‌మ‌య్యాడు! ఈ దారుణం తెలంగాణ‌లోనే జ‌రిగింది.

ఏం జ‌రిగిందంటే..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా కాజీపేట డీజిల్‌ కాలనీకి చెందిన‌ జిన్నారపు వేణుకుమార్‌ (34) చిట్టిల వ్యాపారి. అతనికి రెండుపెళ్లిళ్లయి.. ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిలో తొలి భార్య రైల్వే ఉద్యోగం చేస్తోంది. రెండో ఆమె ఇంట్లో వంట వార్పు చూస్తోంది. ఇక‌, వీరిద్ద‌రినీ కూడా ఒకే ఇంట్లో కాపురం పెట్టిన వేణు.. మ‌రో ప‌క్క చూపు చూశాడు. త‌న దైనందిన ప్ర‌యాణంలో మహబూబాబాద్‌కు చెందిన మరో మహిళ ప‌రిచ‌యం కావ‌డంతో ఆమెతోనూ రిలేష‌న్ పెట్టుకున్నాడు.

అంతేకాదు.. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇద్దరు భార్యలకు చూపిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేశాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మొదటి భార్య తనకు దగ్గరి బంధువైన భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్‌కు రూ.4 లక్షల సుఫారీ ఇచ్చి తన భర్తను హత్య చేయాలని చెప్పింది. పథకం ప్రకారం సెప్టెంబర్‌ 30న మొద‌టి భార్య‌.. వేణుకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. వేణుకుమార్‌ నిద్రలోకి జారుకున్న తర్వాత అప్పటికే వేచి ఉన్న నిందితుల సహకారంతో కారులో పెద్దపల్లి జిల్లా మంథని వద్ద ఉన్న మానేరు వాగు సమీపంలో వేణుకుమార్‌ను గొంతు నులిమి హత్య చేశారు.

అనంతరం ఏమి తెలియనట్లు అక్టోబర్‌ 2న భర్త వేణుకుమార్‌ కనిపించడం లేదంటూ మొద‌టి భార్య‌ కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలో అనుమానం వచ్చిన పోలీసులు.. మొద‌టి భార్య కాల్‌ లిస్ట్ ను బ‌య‌ట‌కు తీశారు. ఇంకేముంది బండారం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఆమెను, రెండో భార్య‌ను, వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న మ‌హిళ‌ను కూడా అరెస్టు చేశారు. అతి ఎప్ప‌టికైనా విషాదానికి దారితీస్తుంద‌ని ఊరికేనే చెప్పలేదు క‌దా! ఇదీ అంతే!!

This post was last modified on December 20, 2022 10:18 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

3 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

5 hours ago