పిచ్చి పలు రకాలు అంటారు. అలాగే ఉంది మధ్యప్రదేశ్ కు చెందిన ఒక యువకుడి తంతు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఒక యువకుడు ఏకంగా దిగ్గజ ప్రపంచ వీడియో స్ట్రీమింగ్ కంపెనీ యూట్యూబ్ పైనే కేసు వేశాడు.
అసలు వారి ఇతనికి ఏమీ అన్యాయం చేశారు అని వివరాల్లోకి వెళితే… యూట్యూబ్ ఛానల్ లో వచ్చే కంటెంట్ వల్ల తను దృష్టి చదువుపై కేంద్రీకరించలేకపోయినట్లు ఆ పిటిషన్ వివరణ.
ఇక జస్టిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఏ ఎస్ ఓకా నేతృత్వంతో కూడిన బెంచ్ ఒక్కసారిగా ఈ అర్థం లేని వాదన విని ఆశ్చర్యపోయింది.
యూట్యూబ్ లోని యాడ్స్ లో ఉండే 18+ కంటెంట్ వలనే తన దృష్టి చదువుపై నుండి సడలినట్లు తెలిపి… అందుకు గాను గూగుల్ నుండి లక్షల రూపాయల నష్టపరిహారం కావాల్సిందిగా కోరాడు ఆ మేధావి యువకుడు.
ఇది విని ఆశ్చర్యపోయిన జడ్జీలు అతనికి నిండుగా చివాట్లు పెట్టేశారు. అసలు ఆ కంటెంట్ ను చూడకుండా ఉండవచ్చు అని… ఆ దిశగా అతను ఎందుకు ఆలోచించలేదని తిరిగి ప్రశ్నించారు.
అర్థంలేని వాదన తీసుకొచ్చి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు తిరిగి ఆ యువకుడే లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు. ఇక నేను నిరుద్యోగిని బాబయ్యా అంటూ అవి అతను కోర్టును మొరపెట్టుకుంటే పాతికవేల రూపాయలతో అది కాస్తా తగ్గించి ఈ కేసుని ముగించారు.
This post was last modified on December 10, 2022 11:27 am
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…