సరిగ్గా ఆరేళ్ల క్రితం.. రాత్రి వేళలో టీవీ స్క్రీన్ల మీద లైవ్ లో ప్రత్యక్షమైన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన వైనాన్ని ప్రకటించి దేశ ప్రజలతో పాటు.. పలు దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు. పెద్ద నోట్ల రద్దు అంటూ అప్పట్లో చెలామణీలో ఉన్న వెయ్యి రూపాయిలు.. రూ.500 నోట్లు రాత్రికి రాత్రి రద్దు అయినట్లుగా చెప్పటంలో ఒక్కసారి అవాక్కు అయిన పరిస్థితి. అనంతరం వాటి స్థానే రూ.2వేల నోట్ ను తీసుకొచ్చి.. కొంతకాలానికి రూ.500నోట్లను తేవటం తెలిసిందే.
గడిచిన కొద్దికాలంగా రూ.2వేల నోట్లు పెద్దగా బయట లభించని పరిస్థితి. తాజాగా సమాచార హక్కుచట్టం కింద రూ.2వేల నోటు గురించి వివరాల్ని అడిగిన ఒక కార్యకర్తకు ఆర్బీఐ బదులిచ్చింది. దాని సారాంశం ఏమంటే.. 2019-2020, 2020-2021, 2021-2022లలో ఒక్కటంటే ఒక్క రూ.2దవేల నోటును కూడా ప్రింట్ చేయలేదని స్పష్టం చేసింది. ఎందుకిలా అన్న దానికి కారణాలు స్పష్టంగా వెల్లడించనప్పటికీ.. రూ.2వేల నోటును క్రమంగా వెనక్కి తీసుకుంటారన్న ప్రచారం నిజమన్న విషయం తాజా సమాధానంతో స్పష్టమైందని చెప్పాలి.
2016-17 ఆర్థిక సంవత్సరంలో 3542.9 మిలియన్ రెండు వేల నోట్లను ప్రింట్ చేయగా.. ఆ సంఖ్య 2017-18లో 111.5కు తగ్గిపోయిందని పేర్కొంది. అంతేకాదు 2018-19లో 46.49 మిలియన్ నోట్లుగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2 వేల నకిలీ నోట్ల సంఖ్య 2016-2020 మధ్య 2277నుంచి 2.44లక్షలకు పెరిగిన వైనం తెలిసిందే. అంటే.. ఒరిజినల్ రూ.2వేల నోట్లు గణనీయంగా తగ్గిపోతే.. అందుకు భిన్నంగా డూప్లికేట్ నోట్లు మాత్రం చెలామణీలోకి వస్తున్న వైనం ఆర్ బీఐ ఇచ్చిన తాజా సమాధానం స్పష్టం చేసిందని చెప్పాలి.
This post was last modified on November 9, 2022 4:18 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…