భార్యా భర్తల మధ్య ప్రేమ, ఆప్యాయతలు అనేవి వారి వయసును బట్టి మారిపోతుంటాయని చాలామంది అనుకుంటుంటారు. పెళ్లైన కొత్తలో భార్యపై ఉన్న ప్రేమ రాను రాను తగ్గిపోతుందని మెజారిటీ జంటలు భావిస్తుంటాయి. ఇక, వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండే భార్యాభర్తలే ఎక్కువగా ఉంటారని..ఆ వయసులో కూడా భార్యను అమితంగా ప్రేమించే భర్తలు ఉండడం చాలా అరుదనేది చాలామంది భావన.
అయితే, ఏడు పదుల వయసులో కూడా భార్య కోసం కుర్రాడిలా మారి స్టెప్పులేసి ఆమెను ఇంప్రెస్ చేయాలని చూసే ఈ భర్త గురించి తెలిస్తే…పైన చెప్పిన వారందరి అభిప్రాయాలు తప్పుకుండా మారిపోతాయి. తన సహధర్మచారిణి కోసం ఈ భర్త చేసిన డ్యాన్స్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘బీస్ట్’ సినిమాలోని చార్ట్ బస్టర్ ‘అరబిక్ కుతు’కు 70 ఏళ్ల వయసున్న ఈ పెద్దాయన వేసిన స్టెప్పులు దుమ్మురేపుతున్నాయి.
శ్రుతి వాసుదేవన్ అనే యువతి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. 70 ఏళ్ల వయసులో కూడా పదేళ్ల పిల్లాడిలా స్టెప్పులేస్తున్న ఆ పెద్దాయన తన తండ్రి అని, ఆమె తన తల్లి అని శ్రుతి పోస్ట్ చేసింది. మనం దృష్టికోణాన్ని బట్టి మన జీవితంలో సంతోషం మన చుట్టూనే ఉంటుందని, మనసులో ఆలోచనలు యువకులలా ఉంటే వయసొక నంబర్ మాత్రమే అని పోస్ట్ చేసింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటువంటి జీవిత భాగస్వామి ఉంటే దాంపత్య జీవితం పరిపూర్ణమైనట్లేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం ఓ పెద్దాయన చేసిన సల్సా డ్యాన్స్ వీడియో కూడా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 8, 2022 2:21 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…