లైఫ్ ను ప్రభావితం నిర్ణయాలు తీసుకునే వేళలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అందులో ఏ మాత్రం ఏమరుపాటుతో వ్యవహరించినా విషాదమే. అలాంటి ఉదంతమే ఒకటి విశాఖలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో లా కాలేజీలో చదువుతున్న లా స్టూడెంట్ ఒకరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న శ్రావణి వైనం సంచలనంగా మారింది. ఆమె విషాద ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో పాపం అనేసే పరిస్థితి.
గుంటూరుకు చెందిన 22 ఏళ్ల శ్రావణి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు కాలేజీలో లా చదువుతోంది. అదే కాలేజీలో సీనియర్ అయిన వినయ్ కుమార్ తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. అతనికి అప్పటికే పెళ్లై.. విడాకులు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఐదు నెలల క్రితం శ్రావణి అతడ్ని రహస్యంగా పెళ్లాడింది. ఒకవైపు లా కోర్సు చేస్తూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. ఇక.. వినయ్ కుమార్ రెస్టారెంట్ లో పని చేస్తున్నాడు.
పెళ్లై.. ఐదు నెలల గడిచాయో లేదో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. మూడు రోజుల క్రితం ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో భర్త వినయ్ గురించి శ్రావణి కంప్లైంట్ చేసింది. దీంతో.. వారిద్దరినీ పిలిచిన పోలీసులు.. స్టేషన్ మొదటి అంతస్తులో కౌన్సెలింగ్ నిర్వహించారు. మధ్యలో బయటకు వచ్చిన ఆమె.. స్టేషన్ కిందకు వచ్చి.. ‘నేను తప్పు చేశా’ అంటూ పెద్దగా రోదిస్తూ.. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటి మీద పోసుకుంది.
ఈ ఉదంతాన్ని గమనించిన పోలీసులు.. ఎస్ఐ శ్రీనివాస్ కు తెలియజేశారు. దీంతో.. ఆయన పరుగు పరుగున కిందకు వచ్చారు. అప్పటికే అగ్గిపుల్ల వెలిగిస్తున్న ఆమెనుఅడ్డుకునే ప్రయత్నం చేయగా.. అప్పటికే మంటలు అంటుకొన్నాయి. ఆర్పే ప్రయత్నంలో ఎస్ఐ చేతులకు గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. కాసేపటికే మరణించింది. ప్రేమించిన వాడిని రహస్యంగా పెళ్లాడి.. విభేదాలతో అర్థాంతంగా ప్రాణాల్ని తీసుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
This post was last modified on October 21, 2022 11:34 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…