Trends

క్వీన్ ఎలిజబెత్ 2 లైఫ్ లో ఆ రెండూ అనూహ్యమే

ప్రపంచంలో ఇప్పటికీ రాజరికం పలు దేశాల్లో ఉన్నా.. అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ లో సంప్రదాయబద్ధమైన రాజరికం నేటికి కొనసాగడం ఒక ఎత్తు అయితే.. దాదాపు ఏడు దశాబ్దాల నుంచి రాణిగా సాగుతున్న మహారాణి కథ గురువారంతో గతమైంది. 96 ఏళ్ల వయసులో మరణించిన ఆమె జీవితంలోని రెండు కీలక ఘట్టాలు రీల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండటం విశేషం. రాణి కావటానికి ముందే ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆమె వివాహం వేళలోనూ..రాణి కిరీటం లభించిన వైనంలోనూ నాటకీయ పరిణామాలు కనిపిస్తాయి.

ప్రేమ పెళ్లి విషయానికి వస్తే.. 1947లో ఆమె గ్రీస్.. డెన్మార్క్ మాజీ రాకుమారుడు ఫిలిప్ మౌంట్ బాటన్ ను ప్రేమించి పెళ్లి చసుకున్నారు. ఫిలిప్ ను ఆమె 1934లో కలిశారు. 1939లో మూడోసారి కలిసిన వేళలో ఎలిజిబెత్ వయసు కేవలం పదమూడేళ్లు మాత్రమే. అప్పట్లోనే ఆమె ధైర్యంగా ఫిలిప్ ను ప్రేమిస్తున్నట్లుగా చెప్పేయటం విశేషం. వీరిద్దరూ పోస్టు ద్వారా ప్రేమలేఖలు పంపుకునేవారు.

అయితే.. వారిద్దరి ప్రేమపై అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి. కారణం.. ఫిలిప్ బ్రిటిషర్ కాకపోవటమే. అతగాడికి రాకుమారిని పెళ్లాడేంత స్థోమత లేకపోవటం కూడా మరో కారణం. అతని చెల్లికి నాజీలతో సంబంధాలు ఉన్న ఒక జర్మన్ ను పెళ్లాడటం లాంటి కారణాలతో ఆమె పెళ్లిపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కారణంతోనే ఫిలిప్ పై చాలాకాలం పత్రికలు.. విమర్శకుల నుంచి ఆయన వ్యతిరేకతను అందుకున్నారు. వీరికి నలుగురు సంతానం కాగా.. వారి పేర్లలో ఎక్కడా కూడా అతడి ఇంటి పేరు లేని పరిస్థితి. ఎలిజిబెత్ రాణిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ ఆయన ఇబ్బందికి గురయ్యారు.

తన లోపలి అసహనాన్ని ఆయన కొన్నిసార్లు బయట పెట్టుకున్నారు. తన పిల్లలకు తన ఇంటి పేరు పెట్టుకోకుండా పోవటానికి కారణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయేవారు. ‘ఈ దేశంలో ఒక వ్యక్తి తన పిల్లలకు తన ఇంటి పేరు పెట్టుకోలేకుండా ఉంటే బహుశా అది నేనొక్కడినే’ అంటూ ఓపెన్ గానే తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఫిలిప్ -ఎలిజిబెత్ దంపతులు మౌంట్ బాటన్ అనే బాలుడ్ని దత్తత తీసుకున్నారు. అతనికి మాత్రం ఫిలిప్ ఇంటి పేరును ఇచ్చారు. అయితే.. మౌంట్ బాటన్ కు రాచరిక హోదా ఉండదు. గత ఏడాది ఏప్రిల్ లో ఎలిజిబెత్ భర్త ఫిలిప్ 99 ఏళ్ల వయసులో మరణించారు.

ఆమె ప్రేమ.. పెళ్లి.. వైవాహిక జీవితం ఇలా ఉంటే.. ఆమె రాణి ఎలా అయ్యారు? దీనికి కారణం ఏమిటి? ఎలా ఆమెకు రాణి కిరీటం సొంతమైందన్న విషయంలోకి వెళితే.. దానికో పెద్ద కథే ఉంది. కింగ్ జార్జి 3 మనవరాళ్లలో తదుపరి రాణి కిరీటాన్ని ధరించేందుకు అవకాశం ఉన్న వరుసలో ఎలిజబెత్ స్థానం మూడోది. ఆమె రాణి అవుతుందని ఎవరూ కలలో కూడా ఊహించేవారు కాదు. విధి విచిత్రమైనది అంటారు కదా? దానికి నిదర్శనంగా ఎలిజిబెత్ ను చెప్పొచ్చు.

ఎలిజిబెత్ 2 పెదనాన్న ఎడ్వర్డ్- 8.. 1936లో కింగ్ జార్జ్ 3 మరణించిన తర్వాత రాజు అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరికి రాణి అయ్యే అవకాశం ఉంది. దీంతో.. వారిద్దరి తర్వాత అవకాశం ఎలిజిబెత్ కు ఉంటుంది. అయితే.. అనూహ్యంగా కింగ్ ఎడ్వర్డ్ 8 విడాకులు తీసుకోవటంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. దీంతో కింగ్ ఎడ్వర్డ్ కుమార్తెలు కాకుండా ఎలిజిబెత్ కు రాణి అయ్యే అవకాశం దక్కింది. అంతేకాదు.. ఎలిజిబెత్ కు సోదరి తప్పించి.. అన్నలు లేకపోవటం కూడా కలిసి వచ్చింది.దీంతో.. ఆమె తదుపరి రాణి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాణిగా.. మహారాణి అవ్వాలని రాసిపెట్టి ఉన్నప్పుడు అన్నీ వారికి అనుకూలంగా జరుగుతాయంటారు. ఇదేనని చెప్పక తప్పదు.

This post was last modified on September 9, 2022 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

2 hours ago

ఓజి… వరప్రసాద్… పెద్ది?

మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…

2 hours ago

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం…

3 hours ago

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

4 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

5 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

6 hours ago