సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి రెండో రాణిగా వ్యవహరించి.. తనదైన శైలిలో పాలనను ముందుకు తీసుకువెళ్లిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2(96) (Elizabeth) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. స్కాట్‌ల్యాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న రాణి ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం(బ్రిటన్ సమయం) కన్నుమూసినట్టు ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.
సుదీర్ఘకాలంపాటు బ్రిటన్‌ను పరిపాలించిన పాలకురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. రాణి మరణంతో యావత్ బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో ఉంటున్న ఆమె.. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వైద్యుల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ స్కాట్లాండ్‌కు వెళ్లి రాణి ఎలిజబెత్‌ను గురువారం ఉదయమే కలుసుకున్నారు. రాణి ఎలిజబెత్ 2 ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ స్పందించారు. ఎలిజబెత్ ఆరోగ్యంపై తనతో పాటు యావత్ దేశం ఆందోళన చెందుతోందన్నారు. తనతోపాటు దేశ ప్రజలందరూ ఆమె కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు. కానీ, ఇంతలోనే ఆమె కన్నుమూశారు.
This post was last modified on September 9, 2022 8:38 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…