జీవితం క్షణ భంగురం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. తన కంటే శక్తివంతుడు లేడనే మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో అస్సలు గుర్తించనే గుర్తించలేరు. కరోనా తర్వాత నుంచి మధ్యవయస్కులు అప్పటివరకు హుషారుగా ఉన్నట్లు ఉంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ప్రాణాలు విడిచే షాకింగ్ పరిణామాలు చూస్తున్నాం. ఇవెంతలా ఉంటున్నాయంటే.. మన కళ్లను మనం నమ్మలేని రీతిలో ఉంటున్నాయి.
ఈ మధ్యనే హైదరాబాద్ లో పంద్రాగస్టు వేళ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ఒక గేటెడ్ కమ్యునిటీలో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి.. పంద్రాగస్టు విశిష్టతను తెలియజేస్తూ.. చరిత్రలోకి వెళ్లటం.. మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ప్రాణాలు గాల్లో కలవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
ఇప్పుడు దాదాపు అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 45 ఏళ్ల మధ్య వయస్కులైన ప్రభాత్ ప్రేమి.. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తుంటారు. గురువారం రాత్రి తన మిత్రుడి పుట్టినరోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు వెళ్లిన ఆయన.. అక్కడ ప్లే అవుతున్న బాలీవుడ్ సాంగ్స్ కు తగ్గట్లుగా హుషారుగా స్టెప్పులు వేశారు.
ఆయన డ్యాన్స్ ను పలువురు రికార్డు చేస్తున్నారు. ఆయన డ్యాన్స్ కు విజిల్స్.. గోలతో ఆయన్ని అప్పటివరకు ప్రోత్సహిస్తున్న వారితో ఆయన మరింత హుషారుగా స్టెప్పులు వేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. అక్కడున్న వారు వెంటనే శ్వాస, నాడి చెక్ చేస్తే… ఆయన అప్పటికే ప్రాణాలతో లేడు. అప్పటివరకు అందరితో నవ్వుతూ.. తుళ్లుతూ హుషారుగా స్టెప్పులు వేస్తూ ఉన్న ఆయన ఒక్కసారిగా ప్రాణాలు విడిచిన వైనం అక్కడి వారిని నోట మాట రానివ్వని రీతిలో మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
This post was last modified on September 3, 2022 11:04 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…