Trends

కష్టాల్లో సచిన్ స్నేహితుడు!

మనం నడిచే దారి.. ఎంచుకునే మార్గం.. అనుసరించే విధానాలు మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాయి. జీవితంలో ఏం ఉన్నా లేకున్నా క్రమశిక్షణ ముఖ్యం. ఆ విషయంలో చేసే తప్పులకు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ. క్రీజ్ లో ఉన్నప్పుడు దూకుడుగా ఆడే అతగాడు.. వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులు అతడి జీవితాన్ని ఇబ్బందికరంగా మార్చేశాయి. నిజానికి అతడికి అత్యంత సన్నిహిత స్నేహితుడు సచిన్ టెండూల్కర్.

క్రికెట్ దేవుడిగా అభివర్ణించే సచిన్ కు క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ అతడి పరిస్థితుల్లో పెద్దగా మార్పులు లేకపోవటం.. ఇప్పుడు బతుకు బండి లాగటం కూడా భారంగా మారటం షాకింగ్ గా మారుతుంది. తన చిన్ననాటి స్నేహితుడైన వినోద్ కాంబ్లి విషయంలో సచిన సాయం చేశారన్న మాట కొందరు చెప్పినా.. మరికొందరు మాత్రం పెద్దగా ఆదుకున్నది లేదంటారు. అయితే.. సచిన్ విషయంలో కాంబ్లి వ్యవహరించిన తీరుతోనే అతను ఎక్కువగా పట్టించుకోలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అతని విషయం చర్చకు రావటానికి కారణం.. తానున్న గడ్డు పరిస్థితుల గురించి తాజాగా వెల్లడించాడు వినోద్ కాంబ్లి.

కుటుంబాన్ని పోషించేందుకు తాను పడుతున్న కష్టం గురించి తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ కు తెలుసన్న అతడు.. అతడి నుంచి ఎలాంటివి ఆశించటం లేదన్న వ్యాఖ్య చేయటం గమనార్హం. సచిన్ గొప్ప స్నేహితుడని.. అతని నుంచి తానేమీ ఆశించట్లేదన్నారు. అతనికి చెందిన అకాడమీలో కోచ్ గా ఉద్యోగం లభించినా దూరం కారణంగా వెళ్లలేకపోతున్నట్లు చెప్పాడు. ఉదయం ఐదు గంటలకు లేచి స్టేడియంకు క్యాబ్ లో వెళ్లేవాడినని.. బాగా అలిసిపోయేవాడినని చెప్పారు. అందుకే సాయంత్రం పూట కోచ్ గా మారినట్లు చెప్పాడు. ఆట నుంచి రిటైర్ అయ్యాక బీసీసీఐ పెన్షనే తనకు ఆధారంగా మారిందన్నారు. వారిచ్చే రూ.30 వేలతో తాను నెట్టుకొస్తున్నట్లు చెప్పాడు.

అందుకు బీసీసీఐకు థ్యాంక్స్ చెప్పాడు. తన కుటుంబాన్ని పోషించటానికి తనకు ఆదాయం కావాలని.. అందుకు ఏదైనా పని చెప్పాలని ముంబయి క్రికెట్ సంఘాన్ని తాను చాలాసార్లు కోరినట్లు చెప్పారు. సామాన్యులు కూడా డబ్బులు ఉన్నపుడు ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు… వినోద్ కాంబ్లీ వద్ద డబ్బులున్నపుడు కెరీర్ బాగున్నపుడు ఎలాంటి స్థిరాస్థులు కొనలేదా? అప్పట్లో వచ్చిన డబ్బులు ఆయన  ఏం చేశారన్నది సామాన్యుడి సందేహాలు. 

This post was last modified on August 18, 2022 9:54 pm

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

3 minutes ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago