Trends

వ్యాపార వేత్త రాకేశ్ ఝున్ ఝున్ వాలా కన్నుమూత

షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఇప్పుడన్న పరిస్థితుల్లో 62 ఏళ్ల వయసులో ప్రముఖ వ్యాపారవేత్త.. ఇటీవలే విమానయాన రంగంలో అడుగు పెట్టిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా తుదిశ్వాస విడిచారు. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఆయన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లుగా చెబుతున్నారు. వైద్యులు చికిత్స చేస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా చెబుతున్నారు. భారత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ గా.. ప్రముఖ ఇన్వెస్టర్ గా పేరున్న ఆయన మరణించారన్న వార్త షాకింగ్ గా మారింది.

గడిచిన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన.. ఈ ఉదయం కన్నుమూశారు. ట్రేడర్ గా.. చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయనకు ఎంతో పేరుంది. భారత సంపన్నుల్లో ఆయన ఒకరు. భారత వారెన్ బఫెట్ గా పేరున్న ఆయన తన వ్యాపార చిట్కాలతో అతి తక్కువ వ్యవధిలో భారీగా వ్రద్ధి చెందారు. ఆకాశ ఎయిర్ పేరుతో కొద్ది రోజుల క్రితమే ఎయిర్ లైన్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

గత ఏడాది ఆకాశ ఎయిర్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి.. రికార్డు సమయంలో విమానాల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఆయన.. దేశీయ విమానయాన రంగంలో మెరుపులు మెరిపిస్తారన్న మాట వినిపిస్తున్న వేళలో.. ఆయన హటాత్తుగా అందరిని విడిచి వెళ్లిపోయిన వైనం జీర్ణించుకోలేనిదిగా మారింది. ఆయనకు భార్య.. నలుగురుపిల్లలు ఉన్నారు.

ముంబయిలోని రాజస్థానీ కుటుంబంలో పెరిగిన ఆయన.. సిడెన్ హామ్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. చార్టెడ్ అకౌంటెంట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన అతి తక్కువ వ్యవధిలోనే ప్రముఖుడిగా అవతరించాడు. డిసెంబరు 2021 నాటికి ఆయన 5.8 బిలియన్ డాలర్ల ఆస్తితో భారత్  లో 48వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన హఠ్మాన్మరణం తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. ఆయన అకాల మరణం రాజకీయ నేతల్ని.. వ్యాపావేత్తల్ని షాక్ కు గురి చేస్తోంది. పలువురు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

This post was last modified on August 14, 2022 10:09 am

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

1 hour ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

10 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

10 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago