కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తును కేవలం ఒక అడుగుకు పరిమితం చేయబోతున్నట్లు ఆ మధ్య ఉత్సవ కమిటీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. నిరుత్సాహానికి గురి చేసింది. ఈసారి కరోనా వల్ల ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం లేకపోయినా.. కనీసం టీవీల్లో అయినా బడా గణేష్‌ను చూసే అవకాశం లేదే అనుకున్నారు.
మరీ విగ్రహం ఎత్తును ఒక్క అడుగుకు పరిమితం చేయడమేంటి అనుకున్నారు. ఐతే అలా అనుకున్న వాళ్లందరి నిరాశను పోగొట్టేలా విగ్రహ కమిటీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈసారి విగ్రహం ఎప్పట్లా 60-70 అడుగులు ఉండట్లేదు. అలాగే ఒకట్రెండు అడుగులకూ పరిమితం కావట్లేదు. మధ్యస్థంగా 27 ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ఈసారి ఖైరతాబాద్ గణేష్‌కు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ ముప్పు తొలగిపోవాలని ఆశిస్తూ విగ్రహాన్ని ‘ధన్వంతరి’ అవతారంలో ప్రతిష్ఠించబోతున్నారు. ఏమాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలు వాడకుండా పూర్తిగా మట్టితోనే విగ్రహాన్ని రూపొందించనున్నారు. విగ్రహం చేస్తోంది మట్టితో కావడంతో ప్రతిష్ఠించిన చోటే దాన్ని నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ నుంచి తెచ్చే ప్రత్యేకమైన మట్టితో విగ్రహం రూపొందించనున్నారు.
కరోనా నేపథ్యంలో విగ్రహ సందర్శనకు భక్తులు ఎవరినీ అనుమతించబోవడం లేదు. ఆన్ లైన్ ద్వారా రుసుము కట్టి పూజలు చేయించుకునే అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 22న వినాయక చవితి కాగా.. జులై 10న విగ్రహం తయారీ మొదలుపెట్టనున్నారు. సెప్టెంబరు 2న నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. పోలీసుల అనుమతి పొందాక ఈ మేరకు పనులు మొదలుపెడతామని ఉత్సవ కమిటీ ప్రకటించింది.
This post was last modified on July 3, 2020 4:29 pm
ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. లాస్ట్ వీక్ భారీ అంచనాల మధ్య వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2 ఆశించిన…
ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కోసం నాని చేస్తున్న ప్రమోషన్లు జాతీయ…
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై విపక్ష వైసీపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు వైసీపీ కీలక…
ఏడాదికి పైగా వెయిట్ చేసి మరీ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో ప్రేక్షకుల ముందుకొచ్చిన కళ్యాణ్ రామ్ తాను కోరుకున్న స్థాయిలో…
నాయకులన్నాక.. ప్రజల మధ్య చర్చ ఉంటుంది. వారిచ్చే మార్కులు కూడా అవసరం. ఒకప్పుడు నాయ కులు.. ప్రజల ఆలోచనలు వేరేగా…
దేవర, ఆదిపురుష్ తో టాలీవుడ్ కు దగ్గరైన సైఫ్ అలీ ఖాన్ మనకు విలన్ గా పరిచయమే కానీ హిందీలో…