ఈ-కామర్స్ వెబ్ సైట్ల నుంచి ఒంటికి, ఇంటికి, ఆఫీసుకి, గుడికి, బడికి.. ఇలా దేనికైనా సరే, అవసరమైన ప్రతి వస్తువూ కొంటాం. కానీ అందులోంచి మద్యం కొనుగోలు చేసి ఇంటికి తెప్పించుకునే అవకాశం మాత్రం లేదు. విదేశాల్లో ఈ అవకాశం ఉంది. మన దగ్గర కూడా ఈ సౌలభ్యం కల్పిస్తే బాగుండని కోరుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు. లాక్ డౌన్ షరతులు నడుస్తున్నపుడు ఈ అవకాశం కల్పించి ఉంటే ఎలా ఉండేదో అని ఎంతోమంది అనుకున్నారు.
ఐతే మందుబాబుల ఈ కల త్వరలో నెరవేరబోతోంది. ఇండియాలో కూడా ఈ-కామర్స్ వెబ్ సైట్ ద్వారా మద్యాన్ని ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకునే అవకాశం దక్కబోతోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా సంపాదించింది. త్వరలోనే ఆ సంస్థ తమ వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు కూడా చేపట్టనుంది.
ఐతే మద్యం అమ్మకాలకు సంబంధించి అమేజాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ సర్కారు. ఆ రాష్ట్రంలో బీర్‌తో పాటు కొన్ని మద్యం ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా అమ్మేందుకు అమేజాన్‌కు అనుమతులు ఇచ్చినట్లు రాయ్‌టర్స్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది. మరో ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ కూడా ఇదే రకమైన అనుమతులు పొందినట్లు ఆ సంస్థ పేర్కొంది.
ఎప్పట్నుంచి ఇలా అమ్మకాలు ప్రారంభిస్తారన్నది తెలియడం లేదు. లాక్ డౌన్ షరతులు ఎత్తేశాక మద్యం దుకాణాల ముందు భారీగా క్యూలు కనిపించిన సంగతి తెలిసిందే. నిర్దిష్ట సమయాల్లోనే అమ్మకాలు సాగుతుండటంతో ఇప్పటికీ దుకాణాల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మందు బాబులు బయటికి వచ్చి కరోనా వ్యాప్తికి కారణం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో ఇది అమలైతే.. మిగతా రాష్ట్రాలు కూడా ఈ బాటలో నడిచే అవకాశముంది. ఇంతకీ దీనిపై కేంద్రం ఏమంటుందో చూడాలి.
This post was last modified on June 23, 2020 10:35 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…