Trends

బాహుబలి ఐపీవో ‘ఎల్ఐసీ’లో మదుపు చేయాలా? వద్దా?

ప్రజల్లో పెద్ద ఎత్తున ఎల్ఐసీ ఐపీవో గురించి ఆసక్తి వ్యక్తమవుతోంది. ఎందుకంటే..  దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతి పెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది. సుమారు ఆరు కోట్ల మంది పాలసీ దారులు ఈ ఐపీవో మీద ఆసక్తితో తమ పాలసీతో పాన్ కార్డును లింకు చేసుకున్నారంటేనే.. ఈ ఐపీవో విషయంలో ఎంతటి ఆసక్తి వ్యక్తమవుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఐపీవోలో మదుపు చేసేందుకు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి వేళ..  ఈ ఐపీవోలో మదుపు చేయటం ఎంతవరకు సబబు? అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మరి.. నిపుణులు ఏమంటున్నారంటే.. ఈ ఐపీవో ద్వారా మొత్తం రూ.21 వేల కోట్లు సమీకరించే ప్రణాళికతో ఎల్ఐసీ వస్తోంది. షేరు విలువ కూడా తక్కువగా ఉండటం లాభించే అంశంగా చెబుతున్నారు. అయితే.. షేర్ మార్కెట్లో మదుపు చేయాలన్నప్పుడు కొన్ని సంప్రదాయ అంశాల్ని చెక్ చేసుకోవడం తప్పనిసరి. మదుపు చేసే వారు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం.. ఈ ఐపీవో కు సంబంధించి సానుకూలతలే కాదు.. ప్రతికూల అంశాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. 2021లో వివిధ ఐపీవోలు మార్కెట్ నుంచి సేకరించిన మొత్తం రూ.లక్ష కోట్లు. 2022లో మాత్రం తీవ్ర ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి.

ఇలాంటి వేళ.. ఐపీవోల ముఖచిత్రాన్నే మార్చే సత్తా ఎల్ఐసీకి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. కంపెనీ ఎంబెడెడ్ వాల్యూను 1.11 రెట్లు మాత్రమే లెక్కించటం సానుకూలాంశంగా చెప్పాలి. గతంలో వచ్చిన హెచ్ డీఎఫ్ సీ ఇన్సూరెన్స్.. ఎస్ బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కంపెనీలు ఐపీవోకి వచ్చినప్పుడు వాటి ఎంబెడెడ్ వాల్యూను 3.4 రెట్లుగా లెక్కించారు. దీనితో పోలిస్తే ఎల్ఐసీ షేర్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది. సాధారణంగా చూసే కంపెనీ చరిత్ర గురించి వస్తే.. ఎల్ఐసీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం బీమా రంగంలో 61.6 శాతం ఈ సంస్థదే. ఇప్పుడున్న హవానే రానున్న రోజుల్లోనూ కంటిన్యూ చేసే వీలుంది.

మే 4న మొదలయ్యే ఈ ఐపీవో ముగింపు మే 9. కనీసం 15 షేర్లను ఒక లాట్ గా ఉంది. ధర విషయానికి వస్తే ఒక్కొక్కటి రూ.902 నుంచి రూ.949 వరకు గరిష్ఠంగా కోట్ చేయొచ్చు. ఒకరు అత్యధికంగా 14 లాట్లు.. అంటే 210 షేర్లు కొనుగోలు చేసే వీలుంది. ఎల్ఐసీ పాలసీదారులకు రూ.60 తగ్గింపుతో షేర్లను కేటాయించనున్నారు. దీన్ని పొందాలంటే ఫిబ్రవరి 13 నాటికి ఏదో ఒక ఎల్ఐసీ పాలసీ ఉండాలి. ఆ పాలసీని పాన్ కార్డును ఫిబ్రవరి 28లోపు లింక్ చేసి ఉండాలి.
ఈ ఐపీవో గురించి అన్ని సానుకూలాంశాలేనా? నెగిటివ్ ఏమీ లేదా? అన్న సందేహం కలగొచ్చు. ఆ విషయానికి వస్తే.. మార్కెట్ మీద పట్టున్నపలువురు నిపుణులు లేవనెత్తుతున్న అంశాల్ని చూస్తే..

–  ప్రైవేటు బీమా కంపెనీల హవాతో ఎల్ఐసీ తన మార్కెట్ వాటాను అంతకంతకూ కోల్పోవటం
– ప్రైవేటు కంపెనీల నుంచి వస్తున్న పోటీ అంతకంతకూ ఎక్కువగా ఉండటం
– ఎల్ఐసీ పాలసీలు ఇప్పటికి సంప్రదాయ పద్దతిలో పాలసీ ఏజెంట్ల ద్వారానే జారీ కావటం
– రెన్యువల్ ప్రీమియంలు 36 శాతం డిజిటల్ గా ఉండటం
– ఈ అంశాల్లో ప్రైవేటు కంపెనీలు ముందుండటం

This post was last modified on May 1, 2022 12:10 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago