బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి. కానీ సినిమాకు సంబంధించిన పని అంటూ వస్తూ తన, మన అనేది చూడడని.. తాను కోరుకున్న ఔట్ పుట్ వచ్చే వరకు ఎంత శ్రమ పెట్టడానికైనా వెనుకాడడని అందరూ అంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా రాజీ పడకుండా రాజమౌళి పెట్టే హింస ఎలా ఉంటుందో తన హీరోలు పలు సందర్భాల్లో చెప్పారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు సంబంధించిన స్టెప్ట్స్ విషయంలో తమకు నరకం చూపించాడంటూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎన్నో రోజుల పాటు రిహార్సల్స్ చేసి.. చివరికి షూటింగ్‌లో పాల్గొంటే.. నాటు నాటు స్పెప్ విషయంలో తమ కాళ్లను పరిశీలిస్తూ.. చిన్న తేడా జరిగినా ఊరుకోకుండా ఎన్నో టేక్స్ చేయించడం గురించి తారక్, చరణ్ చెప్పిన మాటలు వింటే రాజమౌళి ఇంతటి పని రాక్షసుడా.. ఇంతటి పర్ఫెక్షనిస్టా అనే సందేహం కలగక మానదు.
ఇక ‘బాహుబలి’ విషంయలో ప్రభాస్, రానాలను అయితే ఇంతకుమించే కష్టపెట్టాడు జక్కన్న. ప్రభాస్ కెరీర్ మొత్తంలో అన్ని సినిమాలకు కలిపి పడ్డ కష్టం ఈ ఒక్క సినిమాకు పడ్డాడంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా చేస్తూ గాయాలతోనూ అతను ఇబ్బంది పడ్డాడు. తాజాగా ‘బాహుబలి: ది ఎపిక్’ను జపాన్‌లో ప్రమోట్ చేస్తూ.. ఆ సినిమాకు తీసుకున్న ట్రైనింగ్, పడ్డ కష్టం గురించి ప్రభాస్ వివరించాడు.
రాజమౌళి స్ట్రిక్ట్ స్కూల్ ప్రిన్సిపల్ లాంటి వాడని.. ఆయన్ని మెప్పించడానికి చాలా కష్టపడాలని అన్నాడు ప్రభాస్. బాహుబలి సినిమాలో కొండలు ఎక్కే సన్నివేశాల కోసం రోజూ తెల్లవారుజామున లేచి హైదరాబాద్ శివార్లలోని కొండలు ఎక్కుతూ ప్రాక్టీస్ చేసినట్లు ప్రభాస్ వివరించాడు. అలా కొండలు ఎక్కేటపుడు తన చేతులు, వేళ్లను కూడా రాజమౌళి పరిశీలించేవాడని.. వాటి విషయంలోనూ కరెక్షన్లు చెప్పేవాడని వెల్లడించాడు.
ఇక ఈ సినిమా కోసం గుర్రపుస్వారీని కూడా ఎన్నో రోజుల పాటు సాధన చేశామని.. షూటింగ్‌లో రోజూ ఐదు గుర్రాలను పెట్టించేవాడని.. రీటేక్స్ వల్ల ఒక గుర్రం అలసిపోతే ఇంకో గుర్రాన్ని తీసుకొచ్చేవారని.. అలాగే ఈ చిత్రం కోసం కుంగ్ ఫు సహా మరెన్నో ట్రైనింగ్స్ తీసుకున్నామని ప్రభాస్ వివరించాడు. ఆ టైంలో బాడీ బిల్డింగ్ కోసం బాగా గుడ్లు తిన్నట్లు కూడాా ప్రభాస్ తెలిపాడు. అంత కష్టపెట్టి, అలాంటి ఔట్ పుట్ రాబట్టాడు కాబట్టే పదేళ్లు గడిచాక కూడా ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ ఉందని భావించాలి.
This post was last modified on December 6, 2025 4:39 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…