Trends

రాడిసన్ రేవ్ పార్టీ.. ఆ ప్రముఖుల డ్రగ్ షాక్!

రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ‘పుడింగ్ అండ్ మింక్ పబ్’ లో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు సరికొత్త ప్రకంపనలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వేళలో 157 మందిని టాస్కు ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావటం తెలిసిందే. వీరిలో 99 మంది యువకులు.. 39 మంది యువతులు. 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు.

ప్రస్తుతానికి సమయానికి మించిన పబ్ నడుపుతున్నట్లుగా కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించటం ద్వారా.. అక్కడ ఉపయోగించిన డ్రగ్స్ వివరాలు సేకరించనున్నారు.

అదుపులోకి తీసుకున్న వారి వివరాలు సేకరించి.. వారిలో కొందరికి నోటీసులు ఇచ్చి పంపినట్లుగా చెబుతున్నారు. మొత్తం 157 మందిలో 38 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పిల్లలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సదరు పార్టీలో డ్రగ్స్ ను కూడా గుర్తించారంటున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. ఐదు గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బంజారాహిల్స్ సీఐను సస్పెండ్ చేస్తే.. ఏసీపీకి మెమో ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక.. పార్టీలో పాల్గొన్న ప్రముఖుల పిల్లల వివరాల్లోకి వెళితే.. ఒక ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన నటి ఒకరున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు మాత్రం నిహారిక కొణిదెల ఉన్నట్లుగా పేర్కొంటున్నారు.
ఆమెకు ఉదయం టిఫిన్ అందించటం కోసం అక్కడే ఉన్న మీడియాను పంపేందుకు పోలీసులు తెగ ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఏపీకి చెందిన ఒక ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. సినిమా రంగంతో సంబంధం ఉన్న సదరు సెలబ్రిటీ తో పాటు.. ఏపీ పోలీసు శాఖలో అత్యంత కీలక అధికారి.. ఈ మధ్యనే పోలీసు శాఖ నుంచి బయటకు వచ్చిన అధికారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకరు కూడా పట్టుబడిన 38 మందిలో ఒకరుగా చెబుతున్నారు. వీరితో పాటు..సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు బయటకు రావటం.. తనకు పార్టీకి సంబంధం లేదని… తాను కేవలం ఈవెంట్ లో పాటలు పాడటానికి మాత్రమే వెళ్లినట్లు చెబుతున్నారు.

ఇక.. ఈ పబ్ విషయానికి వస్తే మాజీ ఎంపీ.. పవర్ ఫుల్ నేత కుటుంబ సభ్యులదిగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో డ్రగ్స్ పట్టుబడిన కేసులో.. ఇంత భారీగా ప్రముఖులకు చెందిన కుటుంబ సభ్యులు ఉండటం సంచలనంగా మారింది. ఈ మొత్తం ఉదంతం గురించి పోలీసులు పెదవి విప్పకున్నా.. పార్టీకి సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఈ ఇష్యూ మరిన్ని పరిణామాలకు దారి తీస్తుందంటున్నారు.

This post was last modified on April 3, 2022 1:42 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

1 hour ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

10 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

10 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago