Trends

పాకిస్ధాన్ ఉగ్రవాదులకు.. విజయవాడ నుంచి నిధులు

పాకిస్ధాన్ ఉగ్రవాదులకు హెరాయిన్ నిదులు 
విజయవాడలోని సత్యనారాయణపురం ఆషీ ట్రేడర్స్ అడ్రస్ తో జరిగిన మాదక ద్రవ్యాల వ్యాపారం నిధులంతా పాకిస్ధాన్లోని ఉగ్రవాదులకు అందుతున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చార్జిషీటులో స్పష్టంగా చెప్పింది. ఆషీ ట్రేడర్స్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్ నుండి దేశంలోకి హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకుని అనేక రాష్ట్రాల్లో అమ్ముతున్న మాచవరం సుధాకర్, ఆయన భార్య దుర్గా పూర్ణిమా వైశాలితో పాటు మరో 14 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

అప్పట్లో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో సెమీ ప్రాసెస్డ్ టాల్కం స్టోన్స్ రూపంలో పట్టుబడిన హెరాయిన్ దేశంలో సంచలనం సృష్టించింది. అప్పట్లో పట్టుబడిన 3 వేల కిలోల హెరాయిన్ విలువ సుమారు రు. 24 వేల కోట్లుంటుంది. ఆఫ్ఘనిస్థాన్ నుండి దేశంలోకి దిగుమతి చేసుకుంటున్న మాదక ద్రవ్యాలను అమ్మేసి వచ్చిన వేల కోట్ల రూపాయలను పాకిస్ధాన్లోని ఉగ్రవాద గ్రూపులకు అందచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. మాదకద్రవ్యాల అమ్మకం ద్వారా సంపాదించిన డబ్బునంతా పాకిస్ధాన్ కు హవాలా మార్గంలో పంపుతున్నట్లు ఎన్ఐఏ తన చార్జిషీటులో చెప్పింది. 

ఆప్ఘనిస్ధాన్+పాకిస్ధాన్ లోని ఉగ్రవాద సంస్ధలకు సుధాకర్, ఆయన భార్య మరో 14 మంది చేతులు కలిపినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రవాద గ్రూపులతో సుధాకర్ దంపతులతో పాటు మరికొందరు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు ఎన్ఐఏ చెప్పింది. ఎన్ఐఏ చెప్పినదాని ప్రకారం సుధాకర దంపతులతో పాటు మరికొందరు ఉగ్రవాదులతో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడినట్లు చార్జిషీటులో చెప్పింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వస్తున్న హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలు పంజాబ్, ఢిల్లీ, బెంగుళూరు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ఎన్ఐఏ స్పష్టంగా చెప్పింది. 

అందుబాటులోకి వస్తున్న మాదక ద్రవ్యాలనంతా రకరకాల వ్యాపారస్తులు, డీలర్లు, పెడలర్లు తదితరాల రూపంలో మామూలు జనాలకు అందిస్తున్నారు. మామూలు జనాల్లో కూడా ప్రధానంగా కళాశాలలు, స్కూళ్ళ విద్యార్ధులే టార్గెట్ గా అమ్మకాలు  జరుగుతున్నట్లు అందరికీ తెలిసిందే. యువతలో మాదకద్రవ్యాల వాడకం చాలా ఎక్కువైపోతోందనే విషయాలు ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. అయినా దీన్ని అరికట్టడం సాధ్యం కావడం లేదు. మొత్తం మీద ఎన్ఐఏ తాజాగా బయటపెట్టిన చార్జిషీటులో ఉగ్రవాదులతో సంబంధాలు బయటపడటమే ఆశ్చర్యంగా ఉంది.

This post was last modified on March 16, 2022 10:40 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

3 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

5 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

6 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

6 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

7 hours ago