కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు నేడు సంచలన తీర్పునిచ్చింది. హిజాబ్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు…విద్యాసంస్థల యూనిఫాం ప్రోటోకాల్ ను విద్యార్థులంతా అనుసరించాల్సిదేనని తేల్చి చెప్పింది. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తుండగా…వివాదానికి కేంద్రబిందువైన ఉడిపి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడానికి వీల్లేదంటూ ఉడిపిలోని ఓ కాలేజ్ యాజమాన్యం అభ్యంతరం తెలిపింది.
దీంతో, హిజాబ్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హిజాబ్ వస్త్రధారణకు అనుమతివ్వాలంటూ ఉడుపి, కుందాపురలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టి..ఈ రోజు తుది తీర్పునిచ్చింది.
హైకోర్ట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అన్నారు. ప్రతి ఒక్కరూ హైకోర్ట్ ఆదేశాలు పాటించాలని, శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. మరోవైపు, హిజాబ్ పై కర్నాటక హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని మజ్లిస్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లిం బాలికలు హిజాబ్ ధరిస్తే ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మతవిశ్వాసాలను కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పారు. హిజాబ్ బ్యాన్‌పై అప్పీల్‌కు సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్లకు పిలుపునిచ్చారు.
This post was last modified on March 16, 2022 12:36 am
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…