Trends

అమెరికా క్రికెట్.. 17 ఏళ్లకే కెప్టెన్ గా తెలుగమ్మాయి

ప్రతిభ ఉండాలే కానీ అలాంటి వారికి హద్దులు.. సరిహద్దులే ఉండవని చెబుతారు. అందుకు తగ్గట్లే.. దేశం కాని దేశంలో తన టాలెంట్ తో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న తెలుగు అమ్మాయి కథ ఇది. ఇంతా చేస్తే ఆమె వయసు కేవలం పదిహేడేళ్లే. అయితే.. తన పద్నాలుగేళ్ల వయసులోనే సాధించాలన్న కసితో అమెరికా మహిళా క్రికెట్ జట్టు (అండర్ 19 జట్టు)లో చోటు సాధించింది. దగ్గర దగ్గర ఎనిమిదో తరగతి చదివే వయసులో సాధించాలనే కసితో అమెరికా మహిళా క్రికెట్ జట్టుతో చోటు సాధించిన గీతిక కొడాలి వైనం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

చిరు ప్రాయంలో జట్టులో చేరుకున్న ఆమెకు ప్రస్తుతం పదిహేడేళ్లు. అభినందించాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు గీతికకు పదిహేడేళ్లు. ప్రస్తుతం అండర్ 19 జట్టుకు సారథ్యం వహించటం మరో విజయంగా చెప్పాలి. ఇంతకూ ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కింది? ఆమె సాధించిన విజయాలేమిటి? అన్న విషయంలోకి వెళితే.. చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం ఉన్న గీతికకు.. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు కోచ్ రఘను కలిసిందీ అమ్మాయి.

ట్రైనింగ్ తీసుకుంటే క్రికెట్ లో రాణిస్తావని అతడు చెప్పటంతో రెండేళ్ల శిక్షణ తర్వాత తన పద్నాలుగేళ్ల వయసులో అమెరికన్ మహిళా క్రికెట్ జట్టులోకి వెళ్లే అవకాశాన్ని సొంతం చేసుకుంది. జాతీయ క్రికెట్ లీగ్ కు ఆడిన ఆమె.. సీనియర్ల నుంచి నేర్చుకున్న మెలుకువ తో పాటు తనకు అవసరమైన ఫిట్ నెస్.. బౌలింగ్ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంది.

కెనడా.. మెక్సికో..జింబాబ్బే తదితర దేశాల్లో మొత్తం 20 మ్యాచులు ఆడిన ఆమె మూలాల్ని తీసుకుంటే.. తల్లిదండ్రుడు ఏపీకి చెందిన వారు. తల్లి మాధవి.. తండ్రి ప్రశాంత్ ల ప్రోత్సాహం తోడు కావటంతో ఆమెకు ఇబ్బంది లేకుండా పోయింది. అమెరికాలో తొలిసారి గత ఏడాది అండర్ 19 జట్టును ఏర్పాటు చేశారు. జట్టుకు కెప్టెన్ గా నాయకత్వం వహించే అవకాశం ఆమెకు దక్కింది. మొత్తం 15 మందితో కూడిన జట్టు తమ తొలి పర్యటనలో భాగంగా కరేబియన్ ఐలాండ్స్ లో సెయింట్ విన్సెంట్ లో ఆడింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆ జట్టులో అత్యధికులు భారతీయ సంతతికి చెందిన వారే. ఆ సిరీస్ లో మొత్తం నాలుగు మ్యాచులు ఆడి మూడింట్లో గెలిచారు. ఇండియా ఉమెన్స్ ఐపీఎల్ లో పాల్గొనాలని.. అందులో ఆడాలన్నది తన కలగా చెబుతున్నారు. ఆమె ఆ అవకాశాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

This post was last modified on March 7, 2022 12:25 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

20 minutes ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

40 minutes ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

46 minutes ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

49 minutes ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

3 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

4 hours ago