అనుకున్నది సాధించేందుకు మరికొన్ని నిముషాలే సమయం ఉంది. ఉక్రెయిన్‌ప పట్టు బిగించిన రష్యా ఇప్పటికే చాలా నగరాలను స్వాధీనంలోకి తెచ్చుకుంది. అయితే.. కీలకమైన రాజధాని నగరం కీవ్‌ను హస్తగతం చేసుకోవడ మే రష్యా అధినేత పుతిన్ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలోనే ఆయన అడుగులు మరింత వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే సగానిపైగా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.. మరికొద్ది సేపట్లోనే పూర్తిగా ఉక్రెయిన్‌కు గుండె కాయ వంటి కీవ్‌ను ఆయన చేతుల్లోకి తీసు కునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు ఆయన పూర్తి చేశారు.
కీవ్ నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే రష్యా బలగాలు ఉన్నట్లు ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే కీవ్ నగరంలో బాంబుల మోతలు ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్పై సైనిక చర్యను ప్రారంభించిన రష్యా ఆ దేశ రాజధానిని హస్తగతం చేసుకునేందుకు వేగంగా దూసుకెళ్తోంది. నగరానికి మూడు వైపుల నుంచి యుద్ధ ట్యాంకులు, బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే కీవ్ నగరంలో బాంబుల మోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా దాడుల నేపథ్యంలో పశ్చిమ దేశాల నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలని దాడులు చేస్తున్న రష్యాను నిలువరించాలని ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కోరారు. ఈ క్రమంలో ఆ దేశ రాజధానిని వీలైనంత తొందరగా స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లలోనే ఈ లక్ష్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ రాజధాని ప్రమాదపుటంచున ఉన్నట్లు స్పష్టమవుతోంది. రష్యాకు చెందిన బలగాలు, చొరబాటుదారులు రాజధానికి ఉత్తరం వైపు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని తాజాగా ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. అంతకుముందు రెండు ఉక్రెయిన్ మిలిటరీ వాహనాలను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి సైతం ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ రాజధాని రష్యా అధీనంలోకి వెళ్లవచ్చని పేర్కొన్నారు.
This post was last modified on %s = human-readable time difference 8:03 pm
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…
గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది…
కష్టపడితే అందలం ఎక్కించే టాలీవుడ్ పరిశ్రమలో దాన్ని సాధ్యం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. సరైన ప్లానింగ్ తో మంచి…