సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అసభ్య పోస్టుల కేసుపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపిం ది. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని న్యాయవాది అశ్వినీ కుమార్ కోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్‌ను హైకోర్టు ఆదేశించింది.
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల మీద అసభ్య పోస్టుల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. పంచ్ ప్రభాకర్ కేసుపై న్యాయవాది అశ్వినీ కుమార్ మెమో దాఖలు చేశారు. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియో లు అప్‌లోడ్ చేస్తున్నారని నివేదించారు. ప్రైవేట్ యూజర్ ఐడీల ద్వారా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నట్లు వివరించారు. వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్‌ను ఆదేశించింది.
పంచ్ ప్రభాకర్ అరెస్టుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్‌కు అమెరికా పౌరసత్వం ఉందని.. అరెస్టు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని సీబీఐ తెలిపింది. కేంద్రం అనుమతి కోసం దరఖాస్తు చేశామని చెప్పింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ వేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, ప్రైవేట్ వ్యూస్ నిషేధించడానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని యూట్యూబ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేసింది.
This post was last modified on February 22, 2022 8:23 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…