గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 2008లో జరిగిన పేలుళ్ల కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు సంచలన
తీర్పు వెలువరించింది. మొత్తం 77 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిని విచారించిన కోర్టు… 49 మందిని దోషులుగా తేల్చింది. వీరందరికీ ఈ కేసులో ప్రత్యేక్ష ప్రమేయం ఉందని కోర్టు నిర్దారించింది. వీరిలో 38 మంది దోషులకు మరణశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 11 వందల మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.
2008వ సంవత్సరం జూలై 26న అహ్మదాబాద్ నగరంలోని 21 ప్రాంతాల్లో వరుస బాంబుపేలుళ్లు చోటు చేసుకున్నాయి. కేవలం 70 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి. ఈ ఘటనలో 56 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా… 200 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ పేలుళ్లకు తామే కారణమంటూ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహీద్దీన్ ప్రకటించుకుంది. దీని వెనుక పలు మిలిటెంట్ గ్రూపులు కూడా ఉన్నాయని విచారణలో తేలింది. కాగా… బెంగళూరులో బాంబు దాడి జరిగిన మరుసటి రోజే అహ్మదాబాద్ లో బాంబుపేలుళ్లు జరగడం అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
దాదాపు 13 సంవత్సరాల విచారణ అనంతరం ఈరోజు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం. అప్పట్లో ఈ కేసుపై అనేక రాజకీయ వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో రాజకీయ వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బీజేపీపై విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ప్రత్యక కోర్టు తీర్పు వెలువరించడం గమనార్హం.
This post was last modified on February 18, 2022 1:26 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…