కర్నాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం దేశమంతా పాకుతోంది. ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు ముస్లిం విద్యార్ధినులు హిజాబ్ ధరించి కాలేజీకి రావటంతో యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. హిజాబ్ లేకుండానే కాలేజీకి రావాలని స్పష్టంగా చెప్పింది. దీన్ని ఐదు మంది ముస్లిం విద్యార్ధినులు పట్టించుకోకపోవటంతో వివాదం మొదలైంది. వీళ్ళ చర్యను నిరసిస్తూ హిందు విద్యార్ధుల్లో కొందరు కాషాయం కండువాలను, తలపాగాలను ధరించి కాలేజీకి రావటం మొదలుపెట్టారు.
అలాగే హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్ధినులను టీజ్ చేయటం మొదలుపెట్టారు. దాంతో విద్యార్ధులు రెండు గ్రూపులుగా విడిపోవటంతో గొడవలు మొదలైపోయాయి. ఈ వివాదం కర్నాటకలోని ఎనిమిది జిల్లాలకు పాకింది. విజాబ్ వివాదం కరోనా వైరస్ కన్నా చాలా వేగంగా పాకటంతో వేరేదారి లేక ప్రభుత్వం విద్యాసంస్ధలకు సెలవులు కూడా ప్రకటించాల్సొచ్చింది. ఇదే వివాదం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, బీహార్, రాజస్ధాన్, ఢిల్లీ కి చాలా స్పీడుగా పాకిపోయింది.
ఒకవైపేమో హిజాబ్ వివాదాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మొదలు పెట్టవద్దు అని సుప్రీంకోర్టు నెత్తీ నోరు మొత్తుకుంటోంది. అయినా ఎవరు వినటం లేదు. విద్యార్ధుల్లో మొదలైన హిజాబ్ వివాదంలో రాజకీయ నేతల జోక్యం చేసుకున్నారు. వీళ్ళ కారణంగా వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. చివరకు అది కాస్త హిందు-ముస్లిం వివాదంగా మారిపోయింది. ఈ వివాదంలోకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంటరవ్వగానే ముస్లింలు ఏకమైపోయారు. దాని కారణంగానే చాలా స్పీడుగా వివాదానికి రాజకీయ రంగులు పులుముకున్నాయి.
ఇదే విషయమై రాజస్ధాన్ లోని జైపూర్లో కూడా పెద్ద గొడవైంది. యూనీఫారమ్ కు బిన్నంగా కొందరు విద్యార్ధినులు బుర్కాను ధరించారని యాజమాన్యం వాళ్ళని కాలేజీలోకి అనుమతించలేదు. దాంతో విషయం తెలియగానే వాళ్ళ తల్లిదండ్రులు రంగంలోకి దిగేశారు. ఎప్పుడైతే వివాదం జరుగుతున్న విషయం తెలియగానే వెంటనే ముస్లింలకు మద్దతుగా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో జైపూర్లో శుక్రవారమంతా పెద్ద గొడవలు జరిగాయి. చివరకు ఈ హిజాబ్ వివాదం యావత్ దేశాన్ని కుదిపేసేట్లుంది చూస్తుంటే.
This post was last modified on February 12, 2022 11:51 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…