కేంద్రం బడ్జెట్-2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్. సాధారణంగా ఉపయోగించే కొన్ని వస్తువు లపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే కొన్నింటిపై దిగుమతి సుంకంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వస్తువులు చౌకగా రానుండగా, మరికొన్ని మాత్రం ప్రియం కానున్నాయి.
దీంతో మొబైల్ కెమెరా లెన్స్ ధరలు తగ్గనున్నాయి. అలాగే కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, లౌడ్ స్పీకర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువులు చౌకగా లభిస్తాయో ఓసారి చూద్దాం.
ధరలు పెరిగేవి..
గొడుగులు, అనుకరణ ఆభరణాలు, లౌడ్ స్పీకర్లు, హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, స్మార్ట్ మీటర్స్, సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్క్స్, ఎక్సరే మెషీన్లు, ఎలక్ట్రిక్ బొమ్మల విడిభాగాలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెల, ఖర్జూరం, టూత్ బ్రష్‌లు, షేవింగ్ క్రీములు, ఫ్యాషన్ షూలు, చెప్పులు. కార్ల విడిభాగాలు. టైర్లు, ట్యూబులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, విదేశీ అరటిపళ్లు.
ధరలు తగ్గేవి..
పాలిష్ చేసిన వజ్రాలు, మొబైల్ ఫోన్ల కెమెరా లెన్స్, ఇంగువ, కొకోవా బీన్స్, ఎసిటిక్ ఆమ్లాలు, మిథైల్ ఆల్కహాల్, ఫ్రోజెన్ మస్సెల్స్ఫ్రోజెన్ స్క్విడ్స్, ఒక రకమైన చాక్‌లెట్లు, శీతల పానీయాలు, జ్యూసులు, ప్రాసెస్‌డ్ ఫుడ్. రత్నాలు, వజ్రాలు, మొబైల్ ఫోన్లు. మొబైల్ ఫోన్ ఛార్జర్లు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు, మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలు, స్మార్ట్‌వాచ్, వినికిడి పరికరాలు. వ్యవసాయ ఉపకరణాలు.
This post was last modified on February 1, 2022 6:22 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…