Trends

ఫోన్లు, ఇంట‌ర్నెట్‌పై కేంద్రం మ‌రింత పెత్త‌నం

దేశంలో ప్ర‌జ‌లు వినియోగించే ఫోన్లు, ఇంట‌ర్నెట్‌పై కేంద్ర ప్ర‌భుత్వం త‌న పెత్త‌నాన్ని మ‌రింత పెంచింది. కాల్ రికార్డింగ్స్, మేసేజ్‌ల‌కు సంబంధించి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్‌లో పంపిన మెసేజ్ల వివరాలను కనీసం రెండేళ్లపాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. టెలికాం ఆపరేటర్లకు టెలికాం శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏడాది పాటే కాల్ రికార్డింగ్ డేటాను భద్రపరచగా.. ఆ వ్యవధిని రెండేళ్లకు పెంచుతూ టెలికాం శాఖ(డాట్)  ఏకీకృత లైసెన్స్లో సవరణ చేసింది.

నెట్వర్క్ నుంచి జరిగిన సంభాషణలకు సంబంధించి కమర్షియల్ రికార్డ్స్, కాల్ వివరాల రికార్డ్, ఎక్స్ఛేంజ్ వివరాల రికార్డ్, ఐపీ వివరాల రికార్డులను ప్రభుత్వ పరిశీలన కోసం రెండేళ్ల పాటు తప్పనిసరిగా భద్రపరచాలి. లైసెన్సర్ నుంచి ఎలాంటి దిశానిర్దేశాలు అందకపోతే ఆ డేటాను తర్వాత డిలీట్ చేయవచ్చు. వాయిస్ మెయిల్స్, ఆడియో టెక్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సేవలకు ఈ నిబంధన వర్తిస్తుంది అని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.

ఈ లైసెన్సులు పొందిన టాటా కమ్యూనికేషన్స్, సిస్కోస్ వెబెక్స్, ఏటీ అండ్ టీ గ్లోబల్ నెట్‌వర్క్ తదితర కంపెనీలకు కూడా ఈ సవరణ వర్తిస్తుంది. డేట్ ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్(ఐఎల్డీ) లైసెన్స్‌లో సవరణలు చేసింది. దీని ద్వారా కాల్ వివరాల రికార్డులను భద్రపరచడాన్ని ఒక ఏడాది పొడిగించడం సహా ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఉపయోగించి చేసిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ల వివరాలను భద్రపరిచాల్సి ఉంటుంది.

శాటిలైట్ ఫోన్ కాల్స్, డేటా సేవలను అందించడానికి బీఎస్ఎన్ఎల్కు జారీ చేసిన లైసెన్స్‌లోనూ కేంద్రం ఇదే విధమైన సవరణ చేసింది. ఉపగ్రహ ఆధారిత సేవలను అందించే వీశాట్ లైసెన్స్ కలిగిన ఆపరేటర్లకు కూడా కనీసం రెండేళ్లపాటు కాల్ డేటా, ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ రికార్డులను నిల్వ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే.. ఇది చౌర్యానికి దారి తీస్తుంద‌ని.. ప్ర‌జ‌ల‌, వ్య‌క్తుల గోప్యత హ‌క్కుకు భంగం క‌లిగిస్తుంద‌ని.. ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి. అంతేకాదు.. కేవ‌లం బీజేపీ నేత‌లు త‌మ‌కు స‌హ‌క‌రించ‌ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు, రాజ‌కీయ పార్టీలు.. కార్పొరేట్ సంస్థ‌ల‌కు  చెక్ పెట్టేందుకు, వేధించేందుకే దీనిని తీసుకువ‌చ్చార‌ని అంటున్నారు. మున్ముందు ఈ నిర్ణ‌యం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on January 31, 2022 10:44 am

Share

Recent Posts

అప్పుడే అవ్వగొట్టేసిన క్రిష్?

టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…

53 minutes ago

ఎక్స్‌ప్రెస్ దర్శకుడికి హిట్టు దక్కేనా

మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…

2 hours ago

స్నేహం కోసం… అల్లు అర్జున్ ఆదర్శం!

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…

3 hours ago

ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…

3 hours ago

బిర్యానీ సంపూ ఏడిపిస్తాడా?

ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…

3 hours ago

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…

4 hours ago