విరాట్ కోహ్లికి కెరీర్లో ఎన్నడూ లేనంత బ్యాడ్ టైం నడుస్తోంది. అంతర్జాతీయ కెరీర్ ఆరంభమైన దగ్గర్నుంచి.. రెండేళ్ల ముందు వరకు చూస్తే పైకి ఎదగడమే తప్ప కిందికి పడటమే లేదు. ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకోవడంతో పాటు మూడు ఫార్మాట్లలో విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకుని తన హవాను నడిపించాడు. కానీ గత రెండేళ్లలో మొత్తం కథ మారిపోయింది. ఫామ్ పడిపోయింది. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచరీ లేదు. గత మూడు నెలల్లో అనూహ్య పరిణామాల మధ్య మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
దీనికి సంబంధించి ఎడతెగని చర్చ జరుగుతుండగానే.. ఇప్పుడు అనుకోని వివాదం కోహ్లిని చుట్టుముట్టింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా మ్యాచ్ ఆరంభానికి ముందు భారత జాతీయ గీతం పాడే సమయంలో కోహ్లి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
మిగతా సహచరులంతా జాతీయ గీతంతో పదం కలుపుతుంటే.. కోహ్లి పాట పాడకపోగా నోట్లో చూయింగ్ గమ్ వేసుకుని నములుతూ కనిపించాడు. ఇదేదో యథాలాపంగా జరిగిన విషయం లాగా అనిపించడం లేదు. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం పాడటాన్ని ఎవ్వరూ మొక్కుబడిగా తీసుకోలేరు. ఆ సమయంలో ఒకింత గర్వంతో కనిపిస్తారు. గీతం ఆరంభం కాగానే అందరూ అలర్టయిపోతారు.
అలాంటిది కోహ్లి చూయింగ్ గమ్ నములుతూ కనిపించడం, ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో అతడి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇది దేశాన్ని, జాతీయ గీతాన్ని అవమానపరచడమే అంటూ అతణ్ని తిట్టిపోస్తున్నారు. తనను వన్డే కెప్టెన్‌గా తప్పించడంతో అలిగి టెస్టు కెప్టెన్సీ వదిలేసిన విరాట్.. భారత జట్టుకు ఆడటం పట్ల ఇంతకుముందులా గర్వంగా ఫీలవ్వట్లేదని.. తన ఫ్రస్టేషన్‌ను ఇలా చూపిస్తున్నాడన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
This post was last modified on January 24, 2022 10:14 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…