Trends

రోజులో అన్ని కేసులా?

మూడు.. నాలుగు రోజులు క్రితం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టక్ గా వ్యవహరిస్తున్న గడల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణలో మూడో వేవ్ మొదలైందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయినప్పటికీ.. ఎవరికి వారు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న వైఖరి.. ఇప్పుడు షాకిచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది. గడిచిన కొంతకాలంగా హైదరాబాద్ లో నమోదవుతున్న కరోనా కేసులు అంతకంతకూ తగ్గిపోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా కొత్త సంవత్సరంలో కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంది.

తాజాగా రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య పెరిగాయి. గత ఏడాది జూన్ తర్వాత తెలంగాణలో మొదటిసారి కొవిడ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటేసింది. కేవలం రోజు వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా 42,991 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిచంగా.. 1052 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దగ్గర దగ్గర 600 ప్లస్ కేసుల వరకు నమోదైనట్లు పేర్కొన్నారు. సోమవారం నమోదైన కేసులు 294గా ఉంటే.. రోజు గడిచిన తర్వాత దగ్గర దగ్గర 250శాతం పెరుగుదలతో కేసులు నమోదు కావటం ఆందోళనకు గురి చేస్తోంది.

ఇదే రీతిలో కేసుల పెరుగుదల ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయన్న మాట వినిపిస్తోంది. డిచిన 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4858 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా తెలంగాణలో పెరుగుతోంది.

గత 24 గంటలవ్యవధిలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 144కు చేరుకున్నాయి. అంతేకాదు ఎట్ రిస్క్.. నాన్ రిస్క్ దేశాల నుంచి 127 మంది శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారని. వారందరికి కొవిడ్ టెస్టులు చేస్తే 8 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. కొవిడ్ పెరుగుదల రేటు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బీకేర్ ఫుల్.

This post was last modified on January 5, 2022 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

2 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

3 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

4 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

7 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

7 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

7 hours ago