అవును ఇపుడు మెజారిటి జనాలు ఏపీ హైకోర్టు విషయంలో జస్టిస్ చంద్రు ఈమధ్య చేసిన వ్యాఖ్యలపై విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇపుడీ డిమాండ్ ఎందుకు చేస్తున్నారంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజే కారణం. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు లేఖ రాశారు. ఏపీ హైకోర్టుతో పాటు భారత న్యాయవ్యవస్ధ మీద నమ్మకం పోయేలా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ చంద్రుపై సూమోటోగా కేసు నమోదుచేసుకుని విచారణ చేయాలని రఘురామ విజ్ఞప్తిచేశారు.
ఎప్పుడైతే రఘురామ లేఖ రాసిన విషయం వెలుగుచూసిందో అప్పటి నుండే సోషల్ మీడియాలో చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టులో విచారణ జరగాల్సిందే అనే డిమాండ్లు కూడా ఊపందుకుంటున్నాయి. మానవహక్కుల దినోత్సవం రోజున జస్టిస్ చంద్రు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ప్రభుత్వం హైకోర్టుతో పోరాటం చేయాల్సొస్తోందన్నారు. అమరావతి భూ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ధర్మాసనంలో ప్రభుత్వం అభ్యంతరం చెప్పినా ఇద్దరు న్యాయమూర్తులు పక్కకు తప్పుకోకపోవటాన్ని చంద్రు తప్పుపట్టారు.
అలాగే పాలనా వ్యవస్ధను న్యాయవ్యవస్ధ ఎలా శాసిస్తుందని చంద్రు ప్రశ్నించారు. తామడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం జవాబులు చెప్పని కారణంగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాల్సుంటుందని హైకోర్టు వ్యాఖ్యలు చేయటాన్ని కూడా జస్టిస్ చంద్రు తప్పుపట్టారు. ఇలాంటివే మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే చంద్రు వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్+జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే జస్టిస్ చంద్రు అనేదేదో అన్నారు దాన్ని చీఫ్ జస్టిస్ అంతే తీవ్రంగా ఖండించారు. దాంతో వివాదం జస్టిస్ వర్సెస్ చీఫ్ జస్టిస్ అన్నట్లుగా ముగిసిపోయింది. ఈ వివాదంతో ఎలాంటి సంబంధంలేని తిరుగుబాటు ఎంపీ మధ్యలో దూరారు. చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి చంద్రు వ్యాఖ్యలపై విచారణ జరగాల్సిందే అని కోరారు. దాంతో నెటిజన్లు కూడా ఎంపీకే మద్దతు తెలుపుతున్నారు.
విచారణ జరిపితే కానీ జస్టిస్ చంద్రు వ్యాఖ్యల్లోని నిజాలెంతో తెలీవని మెజారిటి జనాలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జస్టిస్ చంద్రుకు మద్దతుగా వ్యతిరేకంగా రాష్ట్రంలో అనేకచోట్ల ర్యాలీలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఒకవేళ చీఫ్ జస్టిస్ విచారణకు ఆదేశిస్తే జస్టిస్ చంద్రు కోర్టులో తన వాదనలను తానే వినిపించుకుంటారనటంలో సందేహం లేదు. అప్పుడు వాద ప్రతివాదనలు రంజుంగా ఉంటాయి. మరి తిరుగుబాటు ఎంపీ లేఖలో కోరినట్లు చీఫ్ జస్టిస్ గనుక సూమోటోగా విచారణ మొదలుపెడతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on December 15, 2021 12:52 pm
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…