ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంతో పేరుందన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా నరేంద్ర చౌదరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఒక సీజన్ లో గంగా నదిలో స్నానం చేయడానికి ఎలా వెళ్తారో, అయ్యప్ప స్వాములు ఎలా గుర్తొస్తారో.. కార్తీక మాసం అనగానే కోటి దీపోత్సవం కూడా భక్తులకు అంతే గుర్తొస్తుంది.
కాంతి జ్ఞానానికి చిహ్నమనీ, అందుకే కోటి దీపాల కాంతులతో భగవంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే మనతో పాటు మన చుట్టు పక్కల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నరేంద్ర చౌదరి.
గతేడాది కోవిడ్ కారణంతో ఎప్పుడూ జరిగే కోటి దీపోత్సవానికి బ్రేక్ పడింది. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కోటి దీపోత్సవానికి ఏమీ ఆటంకం కలగదులే అని భక్తులు అనుకునే టైమ్ కు మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో కరోనా విజృంభించడం, కోటి దీపోత్సవం లేకుండానే కార్తీక మాసం అయిపోవడం అన్నీ జరిగాయి.
దీంతో ఈ ఏడాది ఎలా అయినా సరే కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా, సాక్షాత్తూ భగవంతుడే భువికి దిగివచ్చాడా అనే రీతిలో ఈ కార్యక్రమాన్ని జరపాలని నరేంద్ర చౌదరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారని, నవంబర్ రెండవ వారంలో కోటి దీపోత్సవం మొదలుకానుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇంకో 20 రోజుల్లో కోటి దీపాల వెలుగులు, ఆ దీపాల కంటే ఎక్కువగా ప్రకాశించే ఆడపడుచుల కళ్లతో హైదరాబాద్ కళకళలాడనుంది.
This post was last modified on November 11, 2021 7:43 am
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…