Trends

చైనాలో పెరుగుతున్న ఆహార కొరత !

డ్రాగన్ దేశంలో ఆహార కొరత పెరిగిపోతోంది. ఆర్థిక శక్తిలో అగ్రరాజ్యం అమెరికాను సవాలు చేస్తున్న చైనాలో ఆహార సంక్షోభం పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. ‘సరుకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి, పొట్టుతీయని ధాన్యాలు తినండి, పండ్లు, కూరగాయలను ఆరబెట్టి నిల్వ చేసుకోండి..ఆహారాన్ని వృధా చేయకండి’ అంటు చైనా పాలకులు ప్రజలకు పదే పదే జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచంలో ఆహారకొరత ఉందంటేనే చైనాలో పాలకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది చైనా ప్రజలకే పాలకులు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారంటే అర్ధమేంటి ?

అర్ధం ఏమిటంటే ఆల్ రెడీ చైనాలో ఆహారకొరత మొదలైపోయినట్లుగా అర్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా దేశంలో ఏదైనా సమస్య ఉన్నా ఉందని పాలకులు ఒప్పుకోరన్న విషయం యావత్ ప్రపంచానికి బాగా తెలుసు. అలాంటిది ఇపుడు ఆహార సమస్య రాబోతోందని చైనా పాలకులే బహిరంగంగా ప్రకటనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారంటేనే సమస్య ఎంత స్ధాయిలో అర్ధమైపోతోంది.

అయితే రాబోయే శీతాకాలంలో ఆహార కొరత వచ్చే అవకాశం ఉందన్న కారణంగానే తాము ముందుజాగ్రత్తలు చెబుతున్నట్లు పాలకులు సమర్ధించుకుంటున్నారు. చైనాలో ఆహార కొరతకు కారణాలు ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడటం, చైనాలో శీతాకాలం ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం అని పాలకులు సమర్ధించుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే డ్రాగన్ దేశంలోని పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఎందుకంటే దేశంలోని డ్యాముల్లో నీటిని పంటల అవసరాలకు తగ్గట్లుగా పాలకులు విడుదల చేయలేదు. దీని ఫలితంగా ఏమైందంటే అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవటంతో డ్యాములన్నీ ఒక్కసారిగా ఓవర్ ఫ్లో అయిపోయాయి. డ్యాములు దెబ్బతినకుండా ఉండేందుకు పాలకులు నీటినంతా ఒక్కసారిగా వదిలేశారు. దాంతో వర్షాలకు తోడు డ్యాముల్లోని నీరంతా కిందిప్రాంతాలకు వదిలేయటంతో ఊర్లలోకి, పంటల్లోకి వచ్చేశాయి. దాంతో కోట్లాది ఎకరాల్లోని పంటలన్నీ దెబ్బతినేశాయి. దీంతో దేశంలో ఆహార కొరత వచ్చేసింది.

ఈ విషయాన్ని కప్పిపుచ్చుకుంటున్న పాలకులు ప్రపంచంలో ఆహార కొరత వస్తోందని నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి చైనాలో 23,841 డ్యాములున్నాయి. ప్రపంచంలోని డ్యాముల్లో చైనాలోనే 41 శాతమున్నాయి. అంటే నీటి యాజమాన్యంలో చైనా పాలకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈసారి ఏమైందో తెలీదు కానీ నీటి యాజమాన్య పద్దతులు దెబ్బతినేశాయి. అంతకుముందే కరోనా వైరస్ తీవ్రత, భారీ వర్షాల కారణంగా మొత్తం వ్యవస్ధంతా అస్తవ్యస్ధమైపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పద్దతిలో ఇపుడు కఠినంగా పొదుపు చర్యలు మొదలుపెట్టింది.

This post was last modified on November 8, 2021 10:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

21 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

57 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago