కరోనా దెబ్బకు అన్ని రంగాల్లాగే క్రీడా రంగమూ కుదేలైంది. ముఖ్యంగా ఉపఖండంలో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్లో ఏ యాక్టివిటీ లేదు. లాక్ డౌన్ దెబ్బకు జనాలకు వినోదం లేదు. నిర్వాహకులకు ఆదాయం లేదు. ఇప్పటికే వేల కోట్ల నష్టం వాటిల్లింది. వేసవిలో క్రికెట్ ప్రియుల్ని వినోదంలో ముంచెత్తే ఐపీఎల్‌కు ఈసారి అవకాశమే లేకపోయింది. మళ్లీ ఎప్పుడు ఈ లీగ్‌ను నిర్వహిస్తారు.. అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
ఐపీఎల్‌ను మించిన టోర్నీ అయిన టీ20 ప్రపంచకప్ ఈ ఏడాదే అక్టోబరు-నవంబరు నెలల మధ్య నిర్వహించాల్సి ఉండగా దాని మీదా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇండియాలో జూన్ ఆరంభం నుంచి ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లు నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అనేక పరిమితులు, ఆంక్షలు ఉంటాయి.. పైగా వర్షా కాలం మొదలువుతుంది కాబట్టి ఐపీఎల్ వచ్చే మూణ్నాలు నెలల్లో నిర్వహించే అవకాశం లేనట్లే.
ఐతే ఈ ఏడాది ప్రేక్షకుల్లేకుండా అయినా సరే.. ఐపీఎల్‌ను ఏదో ఒక సమయంలో నిర్వహించి ఎంతో కొంత ఆదాయం రాబట్టాలని బీసీసీఐ చూస్తోంది. దానికి అవకాశం కనిపిస్తున్నది అక్టోబరు, నవంబరు నెలల్లోనే. కానీ అప్పుడే టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఐతే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లాక్ డౌన్ అమలవుతుండటం.. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలుండటం.. టోర్నీ జరగాల్సిన ఆస్ట్రేలియా కూడా ఈ విషయంలో స్ట్రిక్టుగా ఉండటంతో షెడ్యూల్ ప్రకారం టోర్నీ జరగడం కష్టంగా ఉంది.
ఇక ఆటగాళ్లకు, చాలా బోర్డులకు కూడా ఐపీఎల్ పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక ప్రపంచ క్రికెట్లో మోస్ట్ పవర్ ఫుల్ బాడీ అయిన బీసీసీఐ అక్టోబరు-నవంబరు మధ్య టీ20 ప్రపంచకప్ వద్దని ఐసీసీ మీద ఒత్తిడి తెచ్చి ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ భవితవ్యాన్ని తేల్చడానికి గురువారం ఐసీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆ టోర్నీని వాయిదా వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే.. దాని స్థానంలో ఐపీఎల్ జరగబోతోందని ఫిక్సయినట్లే.
This post was last modified on May 27, 2020 7:56 pm
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…