దేశంలో డెల్టా ప్లస్ వేరింయట్ విజృంభణ మొదలైందని అర్థమౌతోంది. ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మొదలౌతున్నాయని నిపుణులు హెచ్చరిస్తుండగా.. తాజాగా తొలి మరణం నమోదైంది. ముంబయిలో ఈ మరణం నమోదు కావడం గమనార్హం.
ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27 వ తేదీన డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కు గురై మరణించింది. డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన మహిళకు రెండు డోసుల టీకాలు వేసినా.. వైరస్ సోకిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు.
మృతురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా డెల్టా ప్లస్ వేరియంట్ సోకి.. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడిందని వైద్యులు వెల్లడించారు. మరణించిన మహిళకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని తేలినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు.ఆ మహిళ కుటుంబంలోని ఆరుగురు కూడా కరోనా మహమ్మారి బారీన పడ్డారని తెలిపారు. ఆరుగురు కరోనా రోగుల్లో ఇద్దరి కి డెల్టా ప్లస్ వేరియంట్ అని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో తేలిందని బీఎంసీ అధికారులు చెప్పారు.
సదరు మహిళ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం గమనార్హం. ఆమె వ్యాక్సిన్ తీసుకున్నా కూడా.. ప్రాణాలు కోల్పోయిందనే విషయం ఇతరులను భయపెడుతోంది. ఈ క్రమంలో.. డెల్టా ప్లస్ వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.
This post was last modified on August 13, 2021 5:41 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…