Trends

తన దేశ ప్రజల కోసం రషీద్ ఖాన్ ఆవేదన

అప్ఘానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గురించి క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర లేదు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసే స్మార్ట్ బౌలర్ గా రషీద్ ఖాన్ కు పేరుంది. అంతేకాదు, లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గానూ రాణిస్తోన్న రషీద్ ఖాన్…ఆల్ రౌండర్ గా తన జట్టు కోసం ప్రాణం పెట్టి ఆడుతుంటాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లోనూ రాణించిన ఈ అఫ్ఘాన్ ఆల్ రౌండర్ కు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు భారత్ లోనూ అభిమానులున్నారు.

అయితే, దేశం కోసం మైదానంలో వీరోచితంగా పోరాడే రషీద్ ఖాన్…ఇపుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన దేశ ప్రజల కోసం చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాడు. అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత తాలిబన్ల ఆధిపత్యంతో రణరంగంగా మారిన తన దేశాన్ని కాపాడాలంటూ రషీద్ ఖాన్ ప్రపంచ దేశాలను వేడుకుంటున్నాడు. తాలిబన్ల చేతిలో అమాయక ప్రజలు బలవుతున్నారని ఈ యువ ఆటగాడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

దేశంలో అల్లకల్లోక పరిస్థితుల వల్ల పసి పిల్లలు, మహిళలు సహా అనేక మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి పరిస్థితుల నుంచి తమ దేశాన్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు.

తన దేశం అల్లకల్లోలంలో ఉందని, ప్రతి రోజు వేలాదిమంది పిల్లలు, మహిళలు సహా అమాయక ప్రజలు అమరులవుతున్నారుని రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అఫ్ఘాన్ ను ఆదుకోవాలని ప్రపంచ దేశాల నేతలకు రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేశాడు. అమాయక ప్రజల ఇళ్లు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయిని, వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయని తమ దేశ ప్రజలను ఈ కల్లోలంలోనే వదిలేయవద్దని, ఆఫ్ఘన్ ప్రజలపై దాడిని, తమ దేశంలో మారణకాండను అడ్డుకొని శాంతి నెలకొల్పాలని రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఇళ్లు కూలిపోయి శరణార్థులుగా మారి ఆకలితో అలమటిస్తోన్న తన దేశ ప్రజలను ఆదుకోవడానికి ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టానని, దానికి విరాళాలు ఇవ్వాలని రషీద్ ఖాన్ రిక్వెస్ట్ చేశాడు.

కాగా, సుదీర్ఘ కాలం ఆఫ్ఘానిస్థాన్ ల పాగా వేసిన తమ బలగాలను అమెరికా, నాటో వెనక్కు పిలిపించుకున్నాయి. అప్పటి నుంచి ఆఫ్ఘానిస్థాన్ అగ్నిగుండంలా మారింది. ఆ దేశానికి దాడులు, అల్లర్లు కొత్త కాకపోయినా..అమెరికా, నాటో దళాలు వెనుదిరిగిన తర్వాత వాటి తీవ్రత పెరిగింది. ఊహించిన దానికంటే అతి తక్కువ సమయంలోనే అఫ్ఘాన్ …తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో, తాలిబన్లు మరోసారి పడగ విప్పారు.

This post was last modified on August 12, 2021 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

47 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago