ఆటగాడిగా అయినా, కోచ్‌గా అయినా తనకు తానే సాటి అని రుజువు చేశాడు లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా అతను సాధించిన ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ కమిటెడ్ క్రికెటర్‌గా, జట్టు మనిషిగా అతడికి గొప్ప పేరుంది. ఆటగాడిగా కెరీర్ ముగించిన కొన్నేళ్లకే మళ్లీ భారత క్రికెట్‌కు సేవలందించడం కోసం తిరిగొచ్చేశాడు ద్రవిడ్. అండర్-19, భారత్-ఎ జట్ల కోచ్‌గా ద్రవిడ్ ఇండియన్ క్రికెట్లో తెచ్చిన మార్పు అసాధారణం.
ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో భారత్ బలమైన శక్తిగా ఎదిగిందంటే.. యువ ఆటగాళ్లు ప్రపంచ వేదికల్లో అదరగొడుతున్నారంటే.. ఓవైపు కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంటే.. బీసీసీఐ మరో భారత జట్టును శ్రీలంకకు పంపగలిగిందంటే.. ద్వితీయ శ్రేణి జట్టు అనుకున్న ఆ టీం సైతం వన్డే, టీ20 సిరీస్‌లు గెలుచుకుని రాగలిగిందంటే.. అందుకు పరోక్షంగా ద్రవిడే కారణం. యువ ఆటగాళ్లను కొన్నేళ్లుగా అంత బాగా తీర్చిదిద్దాడతను.
ఐతే రెండేళ్లుగా ద్రవిడ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) బాధ్యతలు చూస్తున్నాడు. అండర్-19, భారత్-ఎ జట్ల కోచ్‌గా పని చేయట్లేదు కానీ.. ఈ అకాడమీ ద్వారా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతూనే ఉన్నాడు. అలాగే రీహాబిలిటేషన్ కోసం ఇక్కడికి వచ్చే టీమ్ ఇండియా ఆటగాళ్లకూ సాయపడుతున్నాడు. ఐతే ఇప్పుడు ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ద్రవిడ్ పదవీ కాలం పూర్తయింది. దీంతో ఈ పదవికి మళ్లీ దరఖాస్తులు కోరుతోంది బీసీసీఐ. ద్రవిడ్ మళ్లీ దానికి దరఖాస్తు చేసుకుంటే అతణ్నే ఆ పదవిలో కొనసాగించడం ఖాయం. కానీ ద్రవిడ్ ఆ పని చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్టోబరు-నవంబరు నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌తో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం పూర్తి కానుంది.
ఇప్పటికే రెండు పర్యాయాలు కోచ్‌గా పని చేసిన రవిశాస్త్రి తప్పుకోవడం లాంఛనమే అంటున్నారు. అలాంటపుడు ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవికి పోటీ పడేందుకు అవకాశముంది. అతను రేసులో నిలిస్తే మిగతా వాళ్లకు అవకాశం లేనట్లే. కానీ టీమ్ ఇండియా కోచ్ కావడానికి గతంలోనూ ఛాన్సున్నా ద్రవిడ్ వద్దనుకున్నాడు. కుటుంబాన్ని విడిచి భారత కోచ్‌గా పర్యటనలకు తిరుగుతూ ఉండలేనన్నాడు. మరి ఇప్పుడు అతడి ఆలోచన మారిందా.. భారత కోచ్‌గా కావడానికి సిద్ధమేనా.. లేక ఎన్‌సీఏ డైరెక్టర్‌గానే కొనసాగుతాడా అన్నది చూడాలి.
This post was last modified on August 11, 2021 2:28 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…