టీమిండియాలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ క్రికెటర్ కి కరోనా సోకిందని వార్తలు రాగా.. ఆ క్రికెటర్ రిషబ్ పంత్ గా తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పంత్ కి కరోనా ఎలా సోకిందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పంత్ కి కరోనా సోకి దాదాపు వారం రోజులు అవుతోందట. ఈ విషయాన్ని బీసీసీఐ బయటపెట్టలేదు. కానీ.. ఈ విషయాన్ని స్పోర్ట్స్ టాక్ అనే సంస్థ పేరు వెల్లడించింది. కరోనా సోకిన భారత ఆటగాడు రిషబ్ పంత్ అని తెలిపింది.
రిషబ్ పంత్ ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్నారని, లక్షణాలేవీ లేవని స్పోర్ట్స్ టాక్ వెల్లడించింది. యూరోలో భాగంగా లండన్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లారని, ఆ సమయంలో కరోనా సోకి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ ఒక్కసారి మాత్రమే పంత్ బయో బబుల్ నుండి బయటకొచ్చినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఓ ప్లేయర్‌కు కరోనా సోకిన మాట నిజమే అని చెప్పినా.. పేరు బయటపెట్టలేదు. 8 రోజులుగా ఐసోలేషన్ లో ఉన్నాడని తెలిపారు. అయితే, మిగతా ప్లేయర్స్ కు మాత్రం కరోనా సోకలేదని ధృవీకరించారు.
This post was last modified on July 15, 2021 4:38 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…